పెండ్లికి రానందుకు అతిథికి పెనాల్టీ వేసిన వ‌ధువు.. ఎంతో తెలిస్తే షాక్‌

పెండ్లి అంటే ప్ర‌తి జంట‌కు కూడా ఎంతో ముఖ్య‌మైన వేడుక‌.ఎందుకంటే జీవితంలో ఒకేసారి జ‌రిగే వేడ‌క కాబ‌ట్టి ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో గ్రాండ్‌గా ఉండాల‌ని కోరుకుంటారు.

 The Bride Who Penalized The Guest For Not Coming To The Wedding , Wedding, Viral-TeluguStop.com

అయితే డ‌బ్బులు లేని వారంటే కొంచెం త‌క్కువ బ‌డ్జెట్ లో సింపుల్ గా చేసుకుంటారు కానీ డ‌బ్బున్న వార‌యితే మాత్రం చాలా రిచ్ గాచేసుకోవాల‌ని అనుకుంటారు.ఇక పెండ్లి అంటేనే ప్ర‌తి ఒక్క‌రు కూడా త‌మ బంధువుల‌ను పిలుచుకోవ‌డం చాలా కామ‌న్‌.

అయితే ఇందులో కొంద‌రు వ‌స్తారు కొంద‌రు రారు.ఎందుకంటే ఎవ‌రి అవ‌స‌రాల‌ను బ‌ట్టి వారు వ‌స్తుంటారు.

అందులో త‌ప్పులేదు.

కానీ ఓ వ‌ధువు మాత్రం త‌న పెండ్లికి రాలేద‌ని ఓ అతిథికి ఏకంగా రూ.17 వేల ఫైన్ వేసి ‍కట్టాలని చెప్పింది.దీంతో ఆ వ్య‌క్తితో పాటు అంద‌ర కూడా షాక్ అవుతున్నారు.

అస‌లుఏంటీ క‌థ అంటే.రీసెంట్ గా ఓ జంట పెండ్లి చేసుకుంది.

ఇందులో ఓ వ‌ధువు తన పెళ్లికి ఎలాగైనా స‌రే హాజ‌రు కావాలంటూ ఒక వ్యక్తిని ఆహ్వానించింది.కాగా ఆ స‌ద‌రు అతిథి కూడా త‌ప్ప‌కుండా హాజరవుతానని మాటిచ్చాడు.

అయితే తాను జంట‌గా వ‌స్తాన‌ని చెప్ప‌డంతో ఆ వ‌ధువు ఆ ఇద్ద‌రి కోసం రెండు సీట్ల‌ను రిజ‌ర్వ్ చేసి వారి కోస‌మే వాటిని ఆపింది.

వేరే ఎవ‌రినీ ఆ సీట్ల‌కు రిజ‌ర్వ్ చేయించ‌లేదు.

అయితే ఆమె రిజ‌ర్వ్ చేసిన ఒక్కో సీటుకు దాదాపుగా 2240 డాల‌ర్ల‌ను పెట్టి మ‌రీ ఆ ఇద్ద‌రి కోసం ఈ విధంగా రిజ‌ర్వ్ చేయించింది.కాగా వారికి ఏవో ప‌నులు ఉండ‌టంతో హాజ‌రు కాలేక‌పోయారు.దీంతో ఆ పెళ్లి పెళ్లి కూతురు కోపంతో ఆ సీట్లకు అయిన ఖ‌ర్చు రూ.17,700 చెల్లించాలంటూ ఆ అతిథుల‌కు బిల్లును పంపింది.రిసెప్ష‌న్‌కు రాకపోవ‌డం వ‌ల్ల త‌న‌కు ఆ ఖ‌ర్చు వ‌చ్చింద‌ని కాబ‌ట్టి ఆ ఖ‌ర్చును ఏదో ఒక విధంగా చెల్లించు అంటూ ఇన్‌వాయిస్‌తో స‌హా ఓ బిల్లు నోటీస్ పంపించ‌డం ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube