ఐస్ స్కేటింగ్‌లో అదరగొట్టిన బాలుడు.. అంతలోనే అనుకోని అవాంతరం?

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్‌ అవుతుందో చెప్పలేము.ముఖ్యంగా ఫన్నీ వున్న వీడియోలు ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి.

 The Boy Who Got Into Ice Skating. An Unexpected Trouble Ice Skateing, Viral Latest, News Viral, Social Media , Boy-TeluguStop.com

ఎందుకంటే అలాంటి వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి కనుక.ఈ క్రమంలో ప్రత్యేకించి చిన్నపిల్లల వీడియోలు ఎక్కువగా పోతూ ఉంటాయి.

వారి అల్లారి పనులకు సంబంధించిన వీడియోలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది.

 The Boy Who Got Into Ice Skating. An Unexpected Trouble Ice Skateing, Viral Latest, News Viral, Social Media , Boy-ఐస్ స్కేటింగ్‌లో అదరగొట్టిన బాలుడు.. అంతలోనే అనుకోని అవాంతరం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వీడియోలో ఓ బుడ్డగాడు స్కేటింగ్‌ చేస్తూ ఊహించని రీతిలో బొక్కబోర్లా పడిపోతాడు.పాపం బుడ్డొడు కిందపడ్డ సీన్‌ అక్కడి స్థానికుల్ని తెగ నవ్వించింది.

దాంతో వీడియో ఇప్పుడు నెట్టింట మరింత ఫాస్ట్‌గా వైరల్‌ అవుతోంది.

ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వైరల్ వీడియోలో, ఒక చిన్న పిల్లవాడు స్కేట్‌పార్క్‌లో ఫుల్‌ ప్రొటెక్షన్‌తో స్కేటింగ్‌ చేస్తుండటం మనం గమనించవచ్చు.

ఎత్తైన మంచుప్రదేశం నుండి అందంగా కిందకు దిగడానికి ప్రయత్నిస్తున్నాడు.కానీ, అతడు వెళ్తున్న మార్గంలో అనుకోకుండా ఓ ఎత్తైన దిబ్బలాంటిది ఎదురైంది.

అతడు వెళ్తున్న స్పీడ్‌కి ఆ దిబ్బ వద్ద వేగం కంట్రోల్‌ చేయలేకపోయాడు పాపం.దాంతో ఒక్కసారిగా అంత ఎత్తుకు ఎగిరి కిందపడ్డాడు.

అదృష్టవశాత్తు ఆ బుడ్డోడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.బాలుడు సురక్షితంగా ఉన్నాడు.

అలాగే ఇక్కడ అతడు స్కేటింగ్‌ చేస్తున్న టైమ్‌లో వచ్చే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ కూడా మంచి ఫన్నీగా వుంది.ఇక బాలుడు పడ్డ విధానం చూసి అక్కడే ఉన్న ఓ యువకుడు తెగ నవ్వుకుంటున్నట్టు కుదం మనం ఈ వీడియోలో చూడొచ్చు.మొత్తనికి సోషల్ మీడియాలో మాత్రం వీడియో తెగ హల్‌చల్‌ చేస్తోంది.వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.కొందరు నెటిజన్లు థ్యాంక్‌ గాఢ్‌ బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు అని అంటున్నారు.మరికొందరు తల్లిదండ్రులు ఇలాంటి ఫీట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అని సలహాలిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube