ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో పెద్ద ఎత్తున హాట్ హాట్ గా మారాయి.వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో ఇప్పటి నుండే పార్టీలు వచ్చే ఎన్నికలకు సమాయత్తమవుతున్న పరిస్థితి ఉంది.
అయితే వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతున్న తరుణంలో టీఆర్ఎస్ టార్గెట్ గా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పటికే రకరకాల కార్యాచరణతో టీఆర్ఎస్ పై పోరాటం చేస్తున్న బీజేపీ ప్రస్తుతం మరో ప్రధాన వ్యూహానికి తెర దీస్తున్నట్లు తెలుస్తోంది.
అదేంటనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే కెసీఆర్ కు చాలా దగ్గరగా ఉండి, ప్రస్తుతం కొంత అసంతృప్తిగా ఉన్న వారిని బీజేపీ టార్గెట్ చేస్తోంది.కెసీఆర్ పట్ల అసంతృప్తిగా ఉన్న వారిని తమ అనుకూల ఛానల్ లలో డిబేట్ ల ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా తెర మీదికి తీసుకొచ్చి, వ్యక్తిగతంగా కెసీఆర్ వ్యవహార శైలిపై కెసీఆర్ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తూ తాము మద్దతిస్తున్న పార్టీకి రాజకీయ లబ్ధి జరగాలనే కోణంలో వ్యూహాల్ని రచిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ప్రస్తుతం బీజేపీ వ్యవహరిస్తున్న ఈ వ్యూహాలను అన్నింటినీ కెసీఆర్ ఓ కంట గమణిస్తున్నా అంతగా స్పందించడం లేదు.

ఎందుకంటే ప్రతి ఒక్క అవరోధాన్ని అవకాశంగా మలుచుకోవడంలో కెసీఆర్ ను మించిన రాజకీయ నాయకుడు లేరన్న మాట సుస్పష్టం.అయితే బీజేపీ మాత్రం తమ వ్యూహాన్ని పకడ్భందీగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది.అయితే రానున్న రోజుల్లో కెసీఆర్ స్పందించిన తరువాత బీజేపీని బలంగా ఇరుకున పెట్టే విధంగా వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది.
మరి రానున్న రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది.