టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో ఎట్టకేలకు పొత్తు పెట్టేసుకున్నాడు.ముందు ఈ పొత్తు తెలంగాణ వరకు మాత్రమే పరిమితం అని చెప్పుకొచ్చిన బాబు ఇప్పుడు మెల్లిగా ఏపీ వైపు తీసుకొచ్చారు.
కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై నిర్మించబడిన తెలుగుదేశం పార్టీ , ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడాన్ని టీడీపీలోని మెజార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే అభిప్రాయం ఉంది.
మొదటి నుంచి టీడీపీకి వ్యతిరేకంగా క్షేత్రస్థాయి నుంచి పోరాడుతున్నాము … ఈ దశలతో ఆ పార్టీతో కలిసి ప్రజల్లోకి వెళ్తే తీవ్ర వ్యతిరేకత వస్తుందని , తెలంగాణాలో ఈ పొత్తును ప్రజలు అంగీకరించినా… ఏపీ లో పరిస్థితి భిన్నంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యఖం అవుతున్నాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రకంపనలు మొదలయిపోయాయి.టీడీపీతో పొత్తును సీనియర్ కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.మాజీ మంత్రి, ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు వట్టి వసంత కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.టీడీపీతో కాంగ్రెస్ చేతులు కలపటం పై నిరసనగానే ఆయన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
1983 నుంచి టీడీపీతో పోరాడుతున్నామని.అలాంటి పార్టీతో కలవటం ఏంటని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్, టీడీపీల పొత్తు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించటం ఖాయంగా కన్పిస్తోంది.ఇక టీడీపీ పై వీరోచితంగా పోరాడిన ఆ పార్టీ సీనియర్లు ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.

తెలంగాణాలో కాంగ్రెస్ – టీడీపీ పొత్తుపై అక్కడి కాంగ్రెస్ నాయకుల్లో కొత్త భయాలు స్టార్ట్ అయ్యాయి.ఈ పొత్తును మొన్నటివరకు సమర్ధించినా… చంద్రబాబు స్పీడ్ చూసి వారు భయపడుతున్నారు.కాంగ్రెస్ ను పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసేలా బాబు వ్యవహరిస్తున్నదని, మా పార్టీ మీద కూడా ఆయన పెత్తనం పెరిగిపోయిందని ఇది ఓటర్లలో కొత్త ఆలోచన రేకెత్తించి రివర్స్ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని భయపడుతున్నారు.
ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు రెడ్డి, ఎస్సీ వర్గాలు.ఈ రెండు సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నాయి.అయితే చంద్రబాబు షోతో రెండు రోజులుగా ఈ వర్గాల్లోని కొందరు పునరాలోచనలో పడ్డారని నాయకులకు భయం పట్టుకుంది.