ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 3వ తేదీ (శనివారం) నుంచి తిరిగి ప్రారంభం కాలాల్సిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర మరోసారి వాయిదా వేశారు.విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన దాడిలో కోడి పందాల్లో కోళ్లకు కట్టే కత్తి గాయానికి గురైన జగన్… ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.
గాయం కారణంగా వేసిన కుట్లు ఇంకా మానలేదు… భుజం లోపల కండరాలకు గాయం మానలేదు.ఎడమ చేయి ఎత్తడానికి వీలుకాని పరిస్థితి ఉంది.
దీంతో మరోసారి తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు జగన్.మరో వారం రోజుల పాటు విశ్రాంతి అనంతరం ఈ నెల 10వ తేదీ నుంచి తన పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారు.
.






