సినిమా టికెట్ల బుకింగ్ కోసం వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకువస్తున్న ఏపీ ప్రభుత్వం

సినిమా టికెట్ల బుకింగ్ కోసం వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకువస్తున్న ఏపీ ప్రభుత్వం.సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

 The Ap Government Is Making The Website Available For Booking Movie Tickets , Mo-TeluguStop.com

ఈ మేరకు తాజాగా జీవోను విడుదల చేసింది.సినిమా థియేటర్ లో టికెట్స్ ప్రక్రియను ప్రభుత్వం నిశితంగా గమనించిన తర్వాత రైల్వే ఆన్ లైన్ టికెటింగ్ సిస్టం తరహాలోనే పోర్టల్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

ఇప్పటికే ఈ తరహా విధానం తమిళనాడులో అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్, కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది.

విధి-విధానాలు అభివృద్ధి అమలు ప్రక్రియ ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకుంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

హోంశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మెన్ గా ఎనిమిది మంది అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కో-చైర్మెన్ గా ఐటి విభాగం ముఖ్య కార్యదర్శి, సభ్య కన్వీనర్ గా ఐటి విభాగం ప్రత్యేక కార్యదర్శి, ఈ కమిటీలు సభ్యుల సమాచార శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ప్రతినిధి, ఏపీటీఎస్ ఎండీ, కృష్ణ గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్లు (రెవిన్యూ) ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube