కుక్కలు చింపిన విస్తరిలా కూటమి.. సజ్జల విమర్శలు..!

ఏపీలోని విపక్ష కూటమిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.గతంలో చంద్రబాబు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని విమర్శించారు.

 The Alliance Is Like A Field Torn By Dogs.. Sajjala Criticism , Sajjala Ramakris-TeluguStop.com

టీడీపీ నేతలను బీజేపీ, జనసేనలోకి పంపి టికెట్లు ఇప్పిస్తున్నారని సజ్జల తెలిపారు.చంద్రబాబు తన కోసమే కూటమిని ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు.

అయితే కుక్కలు చింపిన విస్తరిలా కూటమి ఉందన్న సజ్జల వైసీపీని ఢీకొట్టడం సాధ్యం కాదని కూటమి నేతలకు తెలుసని చెప్పారు.అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్( Chandrababu , Pawan Kalyan ) చెరో వైపు బూతులు తిడుతున్నారని తెలిపారు.

కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లేకుండా ప్రజలకు మీరేమి హామీలు ఇస్తారని సజ్జల ప్రశ్నించారు.

జగన్( YS Jagan Mohan Reddy ) కు ప్రత్యామ్నాయంగా ఏమీ చెప్పలేకపోతే మీకెందుకు ఓటేయాలో చెప్పాలన్నారు.డబ్బులు పంపిణీ చేసి అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు.టీడీపీ ఎన్ఆర్ఐలు మందలుగా దిగుతున్నారన్న సజ్జల టీడీపీ ఎన్ఆర్ఐ( TDP )లపై వైసీపీ శ్రేణులు దృష్టి పెట్టాలని తెలిపారు.

టీడీపీ ఎన్ఆర్ఐల పేరుతో ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ఈ క్రమంలోనే ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా అందరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube