లండన్ మేయర్ రేసులో భారత సంతతి నేత తరుణ్ గులాటి

భారత సంతతికి చెందిన తరుణ్ గులాటి ( Tarun Gulati ) లండన్ మేయర్ రేసులో నిలిచిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తన ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు.

 London Mayoral Race Heats Up As Indian-origin Tarun Ghulati Challenges Incumbent-TeluguStop.com

సిట్టింగ్ మేమర్ సాదిక్ ఖాన్‌( Memer Sadiq Khan ) హ్యాట్రిక్ విజయం సాధించనివ్వనని తరుణ్ అంటున్నారు.లండన్‌ను ‘‘ గ్లోబల్ బ్యాంక్ ఆఫ్ వరల్డ్ ’’గా పునరుజ్జీవంపజేయడానికి ఒక వ్యాపారవేత్తగా, పెట్టుబడి నిపుణుడిగా తన అనుభవాన్ని ఉపయోగిస్తానని .మేయర్‌లా కాకుండా ఒక సీఈవోలా లండన్‌ను నడపుతానని తరుణ్ చెబుతున్నారు.మేయర్‌గా లండన్ బ్యాలెన్స్ షీట్‌ను నిర్మిస్తానని.

పెట్టుబడికి ప్రధాన కేంద్రంగా నిలబెడతానని ఆయన వెల్లడించారు.

లండన్‌ను తాను ప్రత్యేకమైన గ్లోబల్ సిటీగా చూస్తున్నానని.

ఇది గ్లోబల్ బ్యాంక్ ఆఫ్ వరల్డ్‌కి సమానమని , ఇక్కడ విభిన్న సంస్కృతులు వర్దిల్లుతాయని తరుణ్ తెలిపారు.లండన్ ప్రజలు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల చేతుల్లో నిరాశకు గురయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.మే 2న లండన్ ( London ) వాసులు మేయర్‌, లండన్ అసెంబ్లీ సభ్యులను ఎన్నుకోనున్నారు.63 ఏళ్ల తరుణ్ గులాటి ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా బరిలో నిలిచారు.అదనంగా.నగర వీధుల్లో భద్రత అనేది ఇతర ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటని ఆయన పేర్కొన్నారు.పోలీస్ అధికారులు తమ విధులు నిర్వర్తించడానికి వనరులను కలిగి వుండటం, రాత్రిపూట మహిళలు నడవటానికి వీధులను సురక్షితంగా వుంచడం, మగ్గర్లు, దొంగలను పట్టుకుని శిక్షించడం వుంటాయని తరుణ్ తెలిపారు.

Telugu Bank, London, Londonmayoral, Sadiq Khan, Tarun Gulati, Ultralow Zone-Telu

అల్ట్రాలో ఎమిషన్స్ జోన్ ( Ultralow emissions zone ) ఛార్జీలతో ముడిపడి వున్న అధిక ఖర్చులు, నగరవ్యాప్తంగా తక్కువ ట్రాఫిక్ నైబర్‌హుడ్‌లు వంటి లేబర్ పార్టీ నేత సాదిక్ ఖాన్ విధానాలను కూడా రద్దు చేస్తానని గులాటీ హామీ ఇచ్చారు.20 ఎంపీహెచ్ వేగపరిమితులు, ఇతర పేలవమైన విధానాలను తాము కోరుకోలేదని.వాతావరణ మార్పు జరుగుతోందని, దాని ప్రభావాలను తగ్గించాల్సిన అవసరం వుందని తరుణ్ అభిప్రాయపడ్డారు.

మనం చేయాల్సిన మార్పులు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వుండాలని.జీవన వ్యయాన్ని భరించే వ్యాలెట్‌లపై ఏకపక్షంగా విధించకూడదని తరుణ్ చెప్పారు.

Telugu Bank, London, Londonmayoral, Sadiq Khan, Tarun Gulati, Ultralow Zone-Telu

మరోవైపు.ఏళ్లుగా లండన్ అసెంబ్లీ సభ్యుడిగా వున్నప్పటికీ మేయర్ వివాదాస్పద విధానాలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ కన్జర్వేటివ్ పార్టీ మేయర్ అభ్యర్ధి సుసాన్ పాల్‌పై తరుణ్ గులాటీ తీవ్ర విమర్శలు చేశారు.సరసమైన గృహాలను సృష్టించడం, కౌన్సిల్ పన్నును తగ్గించడం , యూకే రాజధానిలో పర్యాటకంపై దృష్టి పెట్టడం, పాఠశాలల్లో ఉచిత భోజనం వంటివి తరుణ్ ఇతర హామీల్లో కొన్ని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube