మొన్న జరిగిన స్కంద ప్రి రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య బాబు చీఫ్ గెస్ట్ గా వచ్చిన విషయం మనకు తెలిసిందే…యంగ్ హీరో అయిన రామ్ పోతినేని( Ram Pothineni ) ని ఎంకరేజ్ చేయడానికి బాలయ్య వచ్చి ఆ ఈవెంట్ ను సక్సెస్ చేశాడు ఇందులో భాగంగా రిలీజ్ అయిన స్కంద ట్రైలర్ కూడా అద్బుతం గా ఉంది అంటూ చాలా మంచి రెస్పాన్స్ వస్తున్న నేపద్యం లో ఈ సినిమా మీద జనాల్లో విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి ఇక ఈ సినిమా తో రామ్ మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అంటూ తన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు…ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ చేస్తున్న సినిమా ఇష్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇష్మార్ట్ సినిమా లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే…
ఇక మొదటి పార్ట్ లాగే ఈ సీక్వెల్ లో కూడా రామ్ అదరగొట్టబోతున్నట్టు గా తెలుస్తుంది.ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే ఈ సినిమా కి డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ ( Puri Jagannath )బాలయ్య బాబు కి మంచి ఫ్రెండ్ అనే విషయం మనకు తెలిసిందే ఇందులో భాగంగానే డబల్ ఇష్మార్ట్ సినిమాలో బాలయ్య బాబు ఒక గెస్ట్ రోల్ లో నటించబోతున్నట్టు గా తెలుస్తుంది…
అందుకే ఈ ఈవెంట్ కి కూడా వచ్చారని మరికొందరు అంటున్నారు నిజానికి రామ్ బాలయ్య( Nandamuri Balakrishna ) కాంబో లో వచ్చే సినిమా అంటే చాలా అంచనాలు ఉంటాయి… అయితే ఈ డబల్ ఇష్మార్ట్ లో బాలయ్య పాత్ర ఉండేది కేవలం 15 నిమిషాలు మాత్రమేనట అయిన కూడా అది సినిమా మొత్తం చాలా ఇంపాక్ట్ ఉన్న పాత్ర అని తెలుస్తుంది…ఈ పాత్ర తో బాలయ్య అందరిని అలరిస్తాడని కూడా తెలుస్తుంది…