వావ్.. డైమండ్ లాగా మెరుస్తూ అద్భుతంగా మారనున్న ఆ రైల్వే స్టేషన్... వైరల్ అవుతున్న ఫొటోలు..!

మన భారతదేశంలోని రైల్వేస్టేషన్లలో మామూలు రైల్వే పట్టాలు, ప్లాట్‌ఫామ్‌లు, చిన్నపాటి దుకాణాలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి.సింపుల్‌గా చెప్పాలంటే ఇవి చాలా సాదాసీదాగా కనిపిస్తుంటాయి.

అయితే ఇదంతా నిన్నటి వరకు మాత్రమే! ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలోని రైల్వే స్టేషన్లు అత్యంత సర్వాంగ సుందరంగా మారుతున్నాయి.డెవలప్డ్ కంట్రీస్ నుంచి వచ్చిన ప్రజలు కూడా మన దేశంలోని రైల్వేస్టేషన్లను చూసి అబ్బురపడుతున్నారు.

అయితే వాటికి మించిన మరొక రైల్వే స్టేషన్ తీసుకొచ్చేందుకు ఇండియన్ రైల్వే సిద్ధమయ్యింది.ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ మార్గంలో సూరత్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు భారతీయ రైల్వే నడుంబిగించింది.

తాజాగా ఈ రైల్వే స్టేషన్ కి సంబంధించిన గ్రాఫికల్ ఫొటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది."డైమండ్ సిటీ అయిన సూరత్ లో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ నిర్మించబోతున్నాం.

Advertisement

దానికి సంబంధించిన గ్రాఫికల్ పిక్చర్స్ ఇవి.డైమండ్ ఆకారంలో, డైమండ్ లాగా మెరిసేలా ఈ స్టేషన్ ని తీర్చిదిద్దనున్నాం.ఇందులో సెంట్రలైజ్డ్ ఏసీ, ఆటోమేటిక్ లాడర్, బిజినెస్ లాంజ్ తదితర వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అందించనున్నాం.

మల్టిపుల్ ఫ్లోర్లలో దీన్ని నిర్మించి కొత్త ఇండియాని ప్రపంచానికి చూపించనున్నాం" అని భారతీయ రైల్వే శాఖ ట్విట్టర్ వేదికగా పేర్కొంది.అలాగే మూడు గ్రాఫికల్ ఫొటోలు షేర్ చేసింది.

ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం, డిసెంబర్ 2024 నాటికి ఈ అద్భుతమైన రైల్వే స్టేషన్ నిర్మాణం ఫినిష్ అవుతుంది.

విశేషమేంటంటే, ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ దేశంలోనే తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుగా పేరు తెచ్చుకుంది.ఈ ప్రాజెక్టును నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టింది.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
రతన్ టాటా స్థాపించిన మొత్తం కంపెనీలు ఇవే..?

ముంబై-అహ్మదాబాద్ రైల్వే మార్గం 508 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.అయితే బుల్లెట్ ట్రైన్ రూట్ లో ఏకంగా 12 స్టేషన్లను నిర్మించేందుకు ఇండియన్ రైల్వే సిద్ధమయ్యింది.

Advertisement

ఈ రూట్ లో బుల్లెట్ ట్రైన్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

తాజా వార్తలు