బాలయ్య ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్న థమన్.. అఖండ సినిమాను మించిన బీజీఎంతో?

భగవంత్ కేసరి మూవీ( Bhagavanth kesari movie ) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది.ఇప్పటికే ఓవర్సీస్ లో భగవంత్ కేసరి షోలు పూర్తయ్యాయి.

చిన్నచిన్న మైనస్ లు ఉన్నా ఓవరాల్ గా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటం గమనార్హం.థమన్ సాంగ్స్, బీజీఎం విషయంలో నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

అఖండ సినిమాను మించిన బీజీఎంతో థమన్ మెప్పించడం గమనార్హం.తన మ్యూజిక్, బీజీఎంతో థమన్ బాలయ్య( Nandamuri Balakrishna ) ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నారు.

స్కంద సినిమా( Skanda Movie ) విషయంలో ఒకింత విమర్శలు ఎదుర్కొన్న థమన్ భగవంత్ కేసరి సినిమాకు మాత్రం ప్రాణం పోశారు.బాలయ్య నా కడుపు నింపిన వ్యక్తి అని కొన్నిరోజుల క్రితం కామెంట్ చేసిన థమన్ బాలయ్యపై తనకు ఉన్న అభిమానాన్ని భగవంత్ కేసరి సినిమా ద్వారా మరోమారు చాటుకున్నారనే చెప్పాలి.

Advertisement

తాజాగా ఒక దర్శకుడు థమన్( Thaman S ) బీజీఎంను కించపరిచేలా కామెంట్ చేయగా ఆ విమర్శలకు సైతం థమన్ భగవంత్ కేసరి బీజీఎంతో గట్టిగా సమాధానం చెప్పారు.కంటెంట్ అద్భుతంగా ఉంటే బీజీఎం విషయంలో థమన్ కు ఎవరూ సాటిరారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.భగవంత్ కేసరికి బాలయ్య ఫస్ట్ హీరో అయితే థమన్ సెకండ్ హీరో అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

థమన్ మ్యూజిక్, బీజీఎం అద్భుతంగా ఉండటం వల్లే ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు వరుసగా బాలయ్య సినిమాలకు పని చేసే ఆఫర్లు వస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య థమన్ కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా కావదం గమనార్హం.ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా డిక్టేటర్ కాగా ఆ సినిమా సక్సెస్ సాధించకపోయినా అఖండ నుంచి ఈ కాంబినేషన్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకుంది.

Advertisement

తాజా వార్తలు