'వారసుడు' ఈవెంట్ ను అలా ప్లాన్ చేస్తున్న మేకర్స్.. సంబరాలు స్టార్ట్!

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి ఇప్పుడు తెలుగులో ఫాలోయింగ్ కోసం ట్రై చేస్తున్నాడు.

తమిళ్ లో స్టార్ హీరోల లిష్టులో టాప్ లో ఉన్న ఈయన తెలుగు మార్కెట్ పై కన్నేశాడు.

ఈ క్రమంలోనే విజయ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.ప్రెజెంట్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ తన 66వ సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమా స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి కూడా చేస్తున్నాడు. దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

తమిళ్ లో వరిసు తెలుగులో వారసుడు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఈ సినిమాతో విజయ్ తెలుగులో గ్రాండ్ గా లాంచ్ అవ్వడానికి ప్లానింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

Advertisement

ఇది ఇలా ఉండగా కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ లో చేయాలని అనుకుంటున్నారట.విజయ్ కెరీర్ స్టార్ట్ అయ్యి 30 ఏళ్ళు కంప్లీట్ అయినా సందర్భంగా ఒక గ్రాండ్ ఈవెంట్ ను ప్లాన్ చేసినట్టు సమాచారం.

చూడాలి దీని గురించి ఎలాంటి సమాచారం వస్తుందో.

ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో విజయ్ ఫుడ్ యాప్ డిజైనర్ గా కనిపిస్తాడట.అంతేకాదు ప్లాష్ బ్యాక్ లో కాలేజ్ కు వెళ్లే విద్యార్థిగా కూడా విజయ్ డ్యూయెల్ రోల్స్ లో కనిపించ నున్నట్టు తెలుస్తుంది.మరి ఈ సినిమా విజయ్ కు తెలుగులో ఎలాంటి మార్కెట్ తెచ్చిపెడుతుందో చూడాలి.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు