విజయ్ 'లియో' నుండి మరో స్పెషల్ పోస్టర్.. ఎప్పుడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) ఏ సినిమా చేసిన కూడా కోలీవుడ్ లో సంచలనమే.

యావరేజ్ టాక్ వచ్చిన 200 కోట్లను కలెక్ట్ చేసే సత్తా ఉన్న స్టార్ విజయ్.

మరి అలాంటి హీరో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ లో ఉండే కిక్కే వేరు.వారిసు వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ మరో సినిమాను వెంటనే స్టార్ట్ చేసి పూర్తి కూడా చేసాడు.

దళపతి విజయ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో సినిమా ( LEO Movie )చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటిగా తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఇటీవలే విజయ్ బర్త్ డే కానుకగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు.

Advertisement

ఇక ఇప్పుడు లియో సినిమా నుండి మరో పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు అనే టాక్ వస్తుంది.బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్( Sanjay Dutt ) ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే.మరి ఈయన జులై 29న పుట్టిన రోజు జరుపుకోనున్నారు అని ఆ రోజే మరో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు అని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

లోకేష్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు