పిల్లలు నన్ను క్షమించండి...ఓ అమెరికన్ రాసిన లేఖ...ఎన్నో హృదయాలను కదిలించింది..!!!

అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.లెక్కకు మించిన డెల్టా కేసులు, మృతుల సంఖ్యతో మొదటి వేవ్ కంటే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.

బయటకు వెళ్ళాలంటేనే భయంతో అమెరికా ప్రజలు వణికిపోతున్నారు.మాస్క్ లు ధరిస్తూ, వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఏదో ఒక రూపంలో కరోనా సోకడంతో ప్రజలు మరింత భయబ్రాంతులకు లోనవుతున్నారు.

ఇదిలాఉండగానే అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో స్కూళ్ళు తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆయా ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతూ, అయిష్టంగానే తమ పిల్లలను బడులకు పంపుతున్నారు.ఈ నేపధ్యంలో ఓ తల్లి తన పిల్లలకు ఓ లేఖ రాసింది.

ఆ లేఖలో తనను క్షమించమని వేడుకుంది.ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్న సదర్ లేఖ ఎంతో మందిని కదిలించింది.

Advertisement

ఇంతకీ ఆ లేఖలో ఏముంది.టెక్సాస్ కు చెందిన ఓ తల్లి తమ ఇద్దరు పిల్లలు కిండర్ గార్డెన్ స్కూల్ లో చదివిస్తోంది.

కరోనా సమయంలో తన పిల్లలను బడికి పంపడం ఎంతో సాహసమేనని అయితే అభం శుభం తెలియని పిల్లలను కరోనా సమయంలో బడికి పంపడం వారికి నేను చేసే ద్రోహమేనని, ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా బడికి పంపుతున్నందుకు ఆ తల్లి గుండె తల్లడిల్లింది.మీ చిన్న వయసుకు సరైన రక్షణ నేడు ఈ పరిస్థితులలో లేదు, కరోనాను నియంత్రించే వ్యాక్సిన్ ను ఇప్పించాలేనని కూడా నాకు తెలుసు, ప్రపంచంలో మీకంటే విలువైనది నాకు ఏది లేదు ఎంతో బాధగా ఉంది మిమ్మల్ని రక్షణ లేని బడులకు పంపాలంటే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

బడిలోకి వెళ్ళిన తరువాత అస్సలు మాస్క్ తీయవద్దని వేడుకుంది, మాస్క్ లు వలన ఉపయోగం లేదు ఎందుకంటే మన రాష్ట్ర గవర్నర్ మాస్క్ లు వేసుకోవాలి, దూరం పాటించాలని అనే నిభందన సడలించారు, ఆయన మన జీవితాలని ఎంతో ఇబ్బందులోకి నెట్టేశారుని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ నిర్ణయాన్ని ఖండించింది.మీ జీవితాలను రక్షణ లేని ప్రపంచంలోకి వదులుతున్నాను, ఏం జరుగుతుందోననే భయం నన్ను వెంటాడుతూనే ఉంటుంది, నన్ను క్షమించండి అంటూ ఆవేదన చెందింది.

ఆమె రాసిన ఈ లేఖ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది, దాంతో టెక్సాస్ లోని స్కూల్స్ మాస్క్ నిభందన అమలు చేస్తామని హామీ ఇచ్చాయి.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు