ఉద్యోగం నుండి తొలగించడం సరికాదు - టిటియూ జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఈనెల 5వ తేదీన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని పదవ తరగతి పరీక్షలో ఇన్విజిలేటర్ గా విధులు నిర్వహిస్తున్న సదియా మహదత్ ని ప్రశ్నపత్రం బయటకు వచ్చినందుకు బాధ్యులను చేస్తూ ఉద్యోగం నుండి తొలగించడం సరికాదని పునరాలోచన చేయాలని టిటియు జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి ప్రభుత్వాన్ని కోరారు.

ఇది నేరానికి మించిన శిక్షగా పరిగణిస్తున్నామని, సస్పెండ్ చేసి విచారించాల్సిందిపోయి ఉద్యోగం నుండి తొలగించడం సరికాదని అన్నారు.

ఉద్దేశపూర్వకంగా ఆమె ఎలాంటి తప్పు చేయలేదని ప్రశ్నపత్రం బయటకు రావడానికి సహకరించలేదని అక్కడున్న పరిస్థితిలే చెబుతున్నాయని అన్నారు.మొదటి అర్ధగంట విద్యార్థుల హాజరు, జవాబు పత్రాలపై సంతకం చేయడం, ఓఎంఆర్ షీట్ పై సంతకం చేయడం, విద్యార్థులను క్రమపద్ధతిలో కూర్చుండబెట్టడం,హాల్ టికెట్స్ వెరిఫై చేయడం లాంటి పనులలో ఇన్విజిలేటర్ బిజీగా ఉంటారాన్నరు.

ఇదే ఆదునుగా బయట వ్యక్తులు చెట్టుపైకి ఎక్కి కిటికీ ద్వారా చేయిజాపి ప్రశ్నపత్రం ఫోటో తీయడం,రెప్పపాటులో జరిపోయిందని,పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారని అలాంటప్పుడు ఇది భద్రతాపరమైన లోపమే తప్ప ఆమె ఎలాంటి నేరంచేయలేదని భావిస్తున్నాం అన్నారు.ఇంతకుముందు ఇన్విజిలేటర్ తప్పుచేశాడని తేలితే పరీక్షల వీధులనుండి తొలగించేది లేదా సస్పెండ్ చేసేది కానీ ఉద్యోగం నుండి తొలగించడం మొదటిసారిగా చూస్తున్నాం అన్నారు.

ఒత్తిడిలేని సహజ వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయడంలేదని ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయపడుతున్నారన్నారు.ఇటు ఉపాధ్యాయులపై తీవ్రమైన ఒత్తిడి ఉంది.

Advertisement

ఉపాధ్యాయులంతా 80 శాతం మంది పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చినవారే ఎంతో ఉన్నతచదువులు చదివి వ్యయప్రయాసలకోర్చి లక్షల మందితో పోటీపడి ఉద్యోగం సంపాదించుకుంటారు.కొడితే వీపుమీద కొట్టాలి కానీ పొట్టమీద కొట్టకూడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

ప్రతి పౌరునికి ఉన్నట్టే ఉపాధ్యాయులకు కూడా మానవహక్కులు పౌరహక్కులు చట్టాలు న్యాయవ్యవస్థ ఉంటుంది.అందుకని పెద్ద మనసుతో మానవీయకోణంలో ఆలోచించి మహదత్ ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మరోసారి తెలంగాణ టీచర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తరపున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

ఆమెతో పాటు ఉద్యోగంనుండి తొలగించిన ఇతర ఉపాధ్యాయులను కూడా తగు విచారణ జరిపి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నం.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తడుకల సురేష్ పాల్గొన్నారు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?
Advertisement

Latest Rajanna Sircilla News