పుట్టపర్తి అర్బన్ పోలీస్‎స్టేషన్ దగ్గర టెన్షన్.. టెన్షన్

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్ దగ్గర టెన్షన్ వాతావరణం ఏర్పడింది.పీఎస్ వద్ద జనసేన, సీపీఐ నేతలు ధర్నాకు దిగారు.

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరులు తమ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు.అంతేకాకుండా అక్రమంగా అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసిన తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెన్షన్ల విషయంలో చంద్రబాబు రాజకీయం.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు