అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో( Kalyandurgam ) ఉద్రిక్తత నెలకొంది.ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ, టీడీపీ( YCP , TDP ) వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది.
ఘర్షణ కాస్తా ముదరడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.వైసీపీ ఎన్నికల ప్రచార రథం తాళాలను టీడీపీ వర్గీయులు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య వివాదం చెలరేగిందని తెలుస్తోంది.
తీవ్ర రూపం దాల్చడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు.ఈ దాడుల్లో పలువురికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరు వర్గాల నేతలను సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.







