ఓటుకు నోటు కేసుపై సుప్రీంలో విచారణ వాయిదా

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో( Supreme Court ) విచారణ వాయిదా పడింది.ఈ మేరకు కేసులో తగిన సమాచారం ఇచ్చేందుకు సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అత్యున్నత న్యాయస్థానంను కోరారు.

 Supreme Court Adjourned The Hearing On The Case Of Notes For Votes , Notes For V-TeluguStop.com

ఈ క్రమంలోనే సెలవుల తరువాత విచారణ జరపాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా( Siddharth Luthra ) సుప్రీంకోర్టును కోరారు.ఓటుకు నోటు వ్యవహారం 2015 లో జరిగిందని, ఏళ్ల తరబడి కేసు పెండింగ్ లో ఉందని పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఓటుకు నోటుపై సీబీఐ విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ లో పేర్కొన్నారు.వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జూలై 24వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube