ఆ రాష్ట్రంలో మళ్ళీ ఆలయాలు బంద్ ...!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.ఇలాంటి తరుణంలో కేరళ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 Temples Bandh Again In That State ...!, Coronavirus,kerala, India, Gulf Country-TeluguStop.com

నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను మూసివేయాలని కేరళ సర్కార్ నిర్ణయించింది.నేటి నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించం అంటూ కేరళ దేవస్థానం బోర్డు స్పష్టంగా తెలియజేసింది.

కేరళ ప్రభుత్వం ఆలయాల వారికి జూన్ 30 వరకు భక్తులని ఆలయంలోకి అనుమతించవద్దని ఆలయ అధికారులకు తెలియజేసింది.

ఇక ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వైరస్ పెరుగుతూ ఉండడమే.

ఇక జూన్ నెల అయిపోయిన తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని బోర్డ్ తెలియజేసింది.ఇక ఆలయాలలో రోజువారీ పూజా కార్యక్రమాలు ఎప్పటిలాగే నిర్వహిస్తామని ప్రకటన చేసింది.

ఇటీవల లాక్ డౌన్ నిబంధనలు సడలింపులు అమలు చేసిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య అధిక సంఖ్యలో నమోదు అవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.

దీనితో గల్ఫ్ దేశాల నుంచి ఎవరైనా రాష్ట్రంలోకి రావాలంటే కరోనా లేదా కడక్ట్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి అంటూ తెలియచేసింది.

ఇక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని అంటూ కేరళ సర్కార్ చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube