పవన్ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. జై జగన్‌ అంటున్న నిర్మాతలు

ఏపీలో థియేటర్ల మనుగడ కష్టంగా మారింది.

అక్కడ టికట్ల రేట్లు పెంచాలి, పన్ను తగ్గించాలని గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏపీ నాయకుల చుట్టు తిరుగుతున్నారు.

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యొక్క అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు.ఆయన నుండి స్పందన దక్కలేదు.

దాంతో మంత్రి వద్ద ఇటీవలే భేటీ అయ్యి తమకు కావాల్సిన విషయాల పై చర్చించడం జరిగింది.మంత్రి నుండి ఎలాంటి స్పందన కాని సమాధానం కాని వచ్చిందే లేదు.

సీఎం జగన్ ఇప్పట్లో టికెట్ల రేట్లు పెంచేందుకు ఓకే చెప్పే అవకాశం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సమయంలో పవన్‌ తాజాగా రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో చేసిన వ్యాఖ్యలు చర్చ నీయాంశం అవుతున్నాయి.

Advertisement

మంత్రి నాని పై మరియు జగన్ ప్రభుత్వం పై పవన్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి.ఇప్పటికే టాలీవుడ్ పై జగన్ కు కోపం ఉంది.

ఆ కోపం ఇంకాస్త పెరిగేట్లుగా పవన్ వ్యవహరించాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే తెలుగు నిర్మాతల మండలి నుండి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా ఒక లేఖ వెలువడింది.

కరోనా సమయంలో ఏపీ ప్రభుత్వం నుండి తెలుగు సినిమా పరిశ్రమకు పలు రాయితీలు అందాయి.అందువల్లే నిర్మాతలు మరియు ఇతర ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఏపీ ప్రభుత్వంకు కృతజ్ఞులం అంటూ లేఖలో పేర్కొన్నారు.ఒక వైపు సీఎం జగన్ టికెట్ల రేట్లు తగ్గించడంతో పాటు టికెట్లను ప్రభుత్వం అమ్మడంను పవన్ వ్యతిరేకిస్తే ఇప్పుడు తెలుగు నిర్మాతలు మాత్రం ఆయన్ను పొగుడుతూ లేఖ ఇప్పుడు రాయడం చర్చనీయాంశంగా మారింది.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు