ఎన్నికల సీజన్ కావడం దానికి సంబందించి ఎవరు ఏమి మాట్లాడినా వెంటనే వైరల్ గా మారుతుంది.ఆంధ్ర ప్రదేశ్ నుండి ప్రపంచయాత్రకుడిగా చాలా ఫేమస్ అయిన నా అన్వేషణ( Naa Anveshana ) అనే యూట్యూబ్ చానెల్ కి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది.
ఆయన వీడియోలకు వచ్చే లక్షల వ్యూస్ దానికి సాక్ష్యం .ప్రత్యేకమైన శ్రీకాకుళం స్లాంగ్ తో తనదైన శైలిలో వీడియోలు చేసి అన్వేష్( Anvesh ) ప్రపంచంలోని వివిధ అంశాల పై తనదైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వీడియోలు చేస్తారు.అయితే తొలిసారిగా ఏపీ రాజకీయాలను టార్గెట్ చేస్తూచేసిన ఒక వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.ఈ వీడియో కేంద్రంగా అధికార ప్రతిపక్షాలు ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.
పనిలో పనిగా నా అన్వేషణ ను కూడా ఇందులోకి లాక్కొచ్చి విమర్శిస్తున్నాయి.

ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం( AP Govt ) అమలు చేస్తున్న సంక్షేమ పథకాల( Welfare Schemes ) వల్ల ఆంధ్ర రాష్ట్రం ఆర్దికం గా దివాళా తీసే పరిస్తితి ఉందని ఒకప్పుడు జింబాబ్వే అనుసరించిన విధానాల్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుసరిస్తుందని, అక్కడ లాగా ఇక్కద కూడా పరిస్థితులు విషమించి ఆంధ్రప్రదేశ్ ను తీవ్ర అంధకారంలోకి నెట్టేస్తాయి అన్న అర్థం వచ్చేటట్టుగా ఆయన ఒక వీడియో చేశారు.ప్రజలకు ఉచితాలు అలవాటు చేసి సోమరిపోతులుగా మారుస్తున్నారని ,దానివల్ల ఉత్పాదకత తగ్గి రాష్ట్రం తిరోగమనంలో ప్రయాణిస్తుందని అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.దాంతో దీనిని తెలుగుదేశం అనుకూల మీడియా జగన్ కు(
Jagan ) వ్యతిరేకంగా భారీ ఎత్తున వైరల్ చేస్తూ ఉండగా వైసీపీ సోషల్ మీడియా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తూ ఉంది.

సంక్షేమ పథకాలను ప్రజల జీవితాలను మెరుగుపరచడం కోసం అమలు చేస్తారే తప్ప ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాదని, అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేని అన్వేష్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏమిటంటూ వైసీపీ శ్రేణులు( YCP ) మండిపడుతున్నాయి.సోషల్ మీడియా వేదికగా అన్వేష్ కి కౌంటర్లు ఇస్తున్నాయి.అదే విధంగా మరో వైపు తెలుగుదేశం( TDP ) అనుకూల మీడియా కూడా ఈ విషయాన్ని బాగా హైలైట్ చేస్తుంది .అన్వేష్ చెప్పింది నోటికి నూరు శాతం నిజం అంటూ తెలుగుదేశం శ్రేణులు లైవ్ లు పెట్టి మరీ పాపులర్ చేస్తున్నారు.మరి అన్వేష్ కావాలని చేశారో లేక ఉద్దేశపూర్వకంగా చేశారో తెలియదు కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో మాత్రం తన వీడియో తో సెంటర్ ఆఫ్ టాపిక్ గా మారిపోయారు
.