తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.భారత ప్రయాణికులకు ఉపశమనం

కరోనా తగ్గుముఖం పట్టడం తో కువైట్ ఆంక్షలను  తగ్గించింది.

ఇప్పటి వరకు కువైట్ ఎయిర్ పోర్ట్ కు నిత్యం పది వేల వరకు మాత్రమే ఉండగా ఆ సామర్థ్యాన్ని మరింత పెంచే ఆలోచనలో ఉంది.

2.చైనాలో కొవిడ్ కలకలం .విమానాలు రద్దు

చైనాలో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజు కి పెరుగుతోంది.దీంతో దాదాపు 60 శాతం విమానాలు రద్దు చేశారు.అలాగే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

3.డెల్టా వేరియంట్ పై కోవిషీల్డ్ ప్రభావం

డెల్టా వేరియంట్ పై కోవీషీల్డ్ , ఫైజర్ కోవిడ్ 91 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుంది అని తేలింది.

4.నేపాల్ లో భారీ వర్షాలు

నేపాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఇప్పటికే ఈ ప్రభావంతో 88 మంది మృతి చెందారు.

5.చైనా దురాక్రమణల పై అమెరికా కీలక వ్యాఖ్యలు

చైనా, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సైనిక, రాజకీయ , ఆర్థిక శక్తిగా చైనా ఎదగాలని చూస్తోంది దీనికోసం చుట్టుపక్కల దేశాలను బెదిరిస్తోంది.ఈ వ్యవహారంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.హిమాలయ సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు పాల్పడుతోంది అని చైనాలో కొత్తగా నియమితులైన సీనియర్ దౌత్య వేత్త నికోలస్ బర్న్స్ పేర్కొన్నారు.

6.ట్రంప్ ట్రూత్ సోషల్

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ అనే కొత్త సోషల్ మీడియా నెట్వర్క్  ను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు.

7.అమెరికన్ల ను వణికిస్తున్న కొత్త వ్యాధి

అమెరికాను మరో కొత్త వ్యాధి వణికిస్తోంది.

Advertisement

దీనికి కారణం ఇంట్లో ఉన్న ఉల్లిపాయలు కారణం అనే అనుమానాలు నెలకొన్నాయి.ఈ ఉల్లిపాయల నుంచి సాల్మొనెల్లోసిస్ అనే వ్యాధి వ్యాపిస్తోంది.

8.కెనారీ ఐలాండ్ లో లావా

గత నెల రోజులుగా అగ్ని పర్వతం లావాను విడుదల చేస్తోంది.ఈ లావా ఇప్పుడు సమీపంలోని పట్టణంలోకి ప్రవేశించింది.

9.పాకిస్తాన్ లో కరోనా కొత్త వేరియంట్

పాకిస్తాన్ లో కరోనా కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది.ఆ స్ట్రెయిన్ కు చెందిన కేసులు ఇప్పుడు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.

10.తాలిబన్ ఉప ప్రధాని తో భారత అధికారుల భేటీ

ఆఫ్ఘనిస్తాన్ ఉప ప్రధాని అబ్దుల్ సాలమ్ హనాఫి తో భారత ఉన్నతాధికారులు భేటీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు