తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.ట్రావెల్ బ్యాన్ దేశాల విషయంలో సౌదీ కీలక నిర్ణయం

 సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కరోనా కారణంగా ట్రావెల్ బ్యాన్ చేసిన భారత్ తో సహా పలు దేశాల కు దేశ పౌరులు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.

2.చైనా కవ్వింపులు.ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం

చైనా సరిహద్దుల్లో ఎటువంటి కవ్వింపు చర్యలు జరిగిన ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత ఎయిర్ చీఫ్ మార్షల్ వి ఆర్ చౌదరి తెలిపారు.

3.డాలస్ లో శ్రీ శ్రీ మహాప్రస్థానం ప్రత్యేక సంచికల ఆవిష్కరణ

తెలుగు భాషాభిమాని ప్రముఖ ప్రవాస భారతీయులు నాయకుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర అధ్యక్షతన డాలస్ , పోర్ట్ వర్త్ నగర పరిసర ప్రాంతాల్లో ని సాహితీ ప్రియులు ప్రిస్కో నగరంలోని దేశీ డ్రిస్టిక్ట్ రెస్టారెంట్ లో సమావేశమై మహాకవి శ్రీశ్రీ కి ఘన నివాళులర్పించారు.

4.కొత్త అబార్షన్ చట్టంపై మహిళల నిరసన

అబార్షన్ పై ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ అమెరికా వ్యాప్తంగా వేలాది మంది మహిళలు ఆందోళన చేపట్టారు.

5.వర్జీనియాలో డెమోక్రటిక్ పార్టీ ని గెలిపించండి

నవంబర్ 2న జరిగే ఎన్నికల్లో ఒరిజినల్ గవర్నర్ గా టెర్రీ ని గెలిపించాలని వాషింగ్ టన్ డిసి డెమోక్రాటిక్ పార్టీ నాయకులు కోరారు.

6.ఫేస్ బుక్ కు 7 బిలియన్ డాలర్ల నష్టం

సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకు ఫేస్ బుక్ షట్ డౌన్ అవ్వడం తో సుమారు 7 బిలియన్ డాలర్ల నష్టం చేకూరింది.

7.క్షమాపణలు చెప్పిన ఫేస్ బుక్ సీఈవో

Advertisement

 సాంకేతిక కారణాలతో వాట్సాప్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ సేవలు సోమవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు షట్ డౌన్ కావడం పై ఫేస్ బుక్ సీఈఓ జూకర్ బర్గ్ క్షమాపణలు చెప్పారు.

8.థాయిలాండ్ లో వరదల బీభత్సం

థాయిలాండ్ లో భారీ వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి ప్రజలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోవడం తో పాటు భయాందోళనలో గడుపుతున్నా రు.

9.అబుదాబిలో భారతీయుడుకి 20 కోట్ల లాటరీ

ఓ భారతీయ బృందానికి అబుదాబిలో 20 కోట్లు లాటరీ తగిలింది.ఈ లాటరీ ని 40 మంది పంచుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు