తెలుగు ఎన్ఆర్ఐ డైలీ న్యూస్ రౌండప్

1.కువైట్ లోని ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ మీటింగ్

Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, America ,kuwait,

  కువైట్ లోని ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ బుధవారం మీటింగ్ నిర్వహిస్తున్నట్టు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది.

 

2.కువైట్ లోని భారతీయులకు  గమనిక

  కువైట్ లోని బ్యాంకులు తమ పని వేళలను మార్చే ఆలోచనలో ఉన్నాయి.

ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పనిచేస్తున్నాయి.అయితే ఇకపై ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమయాన్ని మార్చే ఆలోచనలో ఉన్నాయి. 

3.కెనడాలో TACA ఆధ్వర్యంలో ఘనంగా రంజాన్ వేడుకలు

Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, America ,kuwait,

  కెనడాలో తెలుగు అలియన్సెస్ ఆఫ్ కెనడా రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ను మిస్సి సాగా నగరంలోని మెఫిల్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుకను నిర్వహించారు. 

4.న్యూ జెర్సీ లో నాట్స్ ఫుడ్ డ్రైవ్

  ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో ఫుడ్ డ్రైవ్ నిర్వహిస్తోంది.నాట్స్ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. 

5.తానా ఆధ్వర్యంలో ఘనంగా మదర్స్ డే వేడుకలు

Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, America ,kuwait,
Advertisement

  తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా ) మే 6 న కెరోలిన రాష్ట్రం చార్లెట్ నగరం లో నిర్వహించిన మదర్స్ డే వేడుకలు వైభవంగా నిర్వహించారు. 

6.అమెరికాలో రోడ్డు ప్రమాదం తెలంగాణ విద్యార్థి మృతి

  అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి చెందారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి క్రాంతి కిరణ్ రెడ్డి (25 ) అమెరికాలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు.అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రాంతి కిరణ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

7.నేవీ స్థావరంలో రాజపక్సే కుటుంబం

   లంక లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఆందోళనకారులు అక్కడ నిరసనలు తీవ్రంగా చేపట్టారు.ఈ నేపథ్యంలో ప్రధాని మహేంద్ర రాజపక్సే కుటుంబం నేవీ స్థావరంలో తలదాచుకున్నారు. 

8.ఉత్తర కొరియా తో చర్చలకు సిద్ధం : దక్షిణ కొరియా

  ఉత్తర కొరియా తో చర్చలకు తాము సిద్ధమని దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యూన్ - సుక్ - యోల్  ప్రకటించారు. 9.కరోనా ఫోర్త్ వేవ్ రాకపోవచ్చు

  కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం లేనట్టేనని కాన్పూర్ ఐ ఐ టీ శాస్త్రవేత్త మణీందర్ అగర్వాల్ అన్నారు.       .

మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?
Advertisement

తాజా వార్తలు