తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్ 

1.ఐడా బీభత్సం ! ఇద్దరు భారతీయుల మృతదేహాలు లభ్యం

అమెరికాలో భీభత్సం సృష్టించిన ఐడా హరికేన్ లో ఇప్పటికే ఎంతో మంది గల్లంతయ్యారు.

వీరిలో ఇటీవల న్యూజెర్సీలోని పాసై ప్రాంతంలోని ఓ నదిలో ఇద్దరు ఎన్ఆర్ఐ విద్యార్థుల ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి.మృతులు నిధి రానా ( 18), ఆయుష్ రానా ,(21) గా అధికారులు గుర్తించారు. 

2.వలసదారులను బహిష్కరించాలని టూ కువైట్ ఎంపీ డిమాండ్

  కువైటైజేషన్ లో భాగంగా గల్ఫ్ దేశం కువైట్ వలసదారులు విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తోంది.

తాజాగా అక్కడి పార్లమెంట్ సభ్యుడు కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.మానసిక స్థితి సరిగా లేని వలసదారులను దేశం నుంచి బహిష్కరించాలని వారి వల్ల ఎప్పటికైనా ప్రమాదం అని ఆయన వ్యాఖ్యానించారు. 

3.పిల్లలను దత్తత తీసుకోవడం ఎన్నారైలకు ఇక సులువు

  ప్రవాస భారతీయులు విదేశీయులకు పిల్లలను దత్తత ఇచ్చేందుకు సంబంధించిన ప్రక్రియను సరళతరం చేసేలా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనేక మార్గదర్శకాలను రూపొందించింది.హిందూ దత్తత లు, నిర్వహణ చట్టం ప్రకారం వీటిని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. 

4.చికాగోలో నాట్స్ సూపర్ 8 క్రికెట్ టోర్నమెంట్

  అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం  తాజాగా చికాగోలో సూపర్ 8 క్రికెట్ టోర్నమెంట్ ను దిగ్విజయంగా నిర్వహించింది. 

5.ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కరోనా

Advertisement

  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. 

6.అమెరికాపై ఆల్ ఖైదా దాడి చేసే అవకాశం : ఇంటెలిజెన్స్ నివేదిక

  అమెరికా పై మరోసారి ఆల్ఖైదా దాడి చేసే అవకాశాలు ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 

7.కిమ్ కు మెసేజ్ పంపిన క్వీన్ ఎలిజబెత్

  ఉత్తర కొరియా జాతీయ దినోత్సవాల సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోన్ కు బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్ శుభాకాంక్షలు తో కూడిన మెసేజ్ ను పంపారట. 

8.తాలిబన్ ప్రభుత్వం పై ఆధిపత్యం కోసం కత్తర్ వర్సెస్ పాకిస్తాన్

  ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ తన ప్రభావాన్ని చూపించాలని భావిస్తోంది.ఎలాగైనా ఆఫ్గాన్ తమ ఆధీనంలో ఉంచుకోవాలని చూస్తోంది అయితే కథ కూడా ఇదే వైఖరితో ఉండడంతో రెండు దేశాల మధ్య ఆఫ్ఘన్ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 

9.అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హరీష్ హత్యకు కుట్ర

  అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హరీష్ ను చంపేందుకు కుట్ర పన్నినట్లు ఫ్లోరిడాకు చెందిన 38 ఏళ్ల నివియాన్ పెటిట్ పెల్స్ నేరాన్ని అంగీకరించింది. 

10.అఫ్ఘాన్ లో భారతీయ వ్యాపారి కిడ్నాప్

  అఫ్ఘాన్ లో సిక్ వర్గానికి చెందిన ఓ భారతీయ వ్యాపారిని తుపాకులతో బెదిరించి కిడ్నాప్ చేయడం కలకలం రేపింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఈ విషయాన్ని ఇండియన్ వరల్డ్ ఫోరం అధ్యక్షుడు పునీత్ సింగ్ ఛందోక్ ధ్రువీకరించారు.   .

Advertisement

తాజా వార్తలు