తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ రౌండప్ 

1.కెనడాలో తెలుగు సాహితీ సదస్సు .ఆహ్వానం

  కెనడాలో తెలుగు సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నారు ఈ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వక్తలు జూలై 31వ తేదీలోగా దరఖాస్తులు పంపల్సిందిగా కెనడాలోని తెలుగు సంఘాలు సంయుక్తంగా కోరాయి.

2.గల్ఫ్ కార్మికులకు శుభవార్త

గల్ఫ్ కార్మికుల జీవితాలపై కేంద్రం తన విధానాన్ని మార్చుకుంది.గత సెప్టెంబర్ లో జారీచేసిన జీవోలను రద్దు చేసింది.2019 - 20 లో ఉన్నట్టుగానే వేతనాలు ఉంటాయని ప్రకటించింది. 

3.కంటైనర్లను నిలిపివేసిన చైనా .ఏపీ వ్యాపారులకు తీవ్ర నష్టం

  భారత్ నుంచి ఎగుమతి చేసిన 1000 నుంచి 1200 కంటైనర్లను చైనా నిలిపివేసింది.వీటి విలువ 1200 కోట్లు ఉంటుందని అంచనా.

భారత్ నుంచి ఎగుమతి అవుతున్న రొయ్యల ప్యాకింగ్ లపై కరోనా ఆనవాళ్లు ఉన్నట్టు చైనా అనుమానిస్తోంది.ఈ కంటైనర్లలో ఏపీకి చెందిన 25 సంస్థల కంటైనర్లు ఉన్నాయి. 

4.ఆప్ఘాన్ లో ఉగ్రవాదుల ఘాతుకం

  ఆప్ఘాన్ లో  తాలిబాన్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు.కాందహార్ ఫ్రావీన్స్ లో పౌరుల ఇళ్లపై మెరుపు దాడులు నిర్వహించారు.ఇళ్లపై దాడులు నిర్వహించి దోపిడీకి పాల్పడ్డారు.ఈ ఘటనలో దాదాపు 100 మంది పౌరులు మరణించారు. 

5.అమెరికా కాంగ్రెస్ పోటీలో భారత సంతతి మహిళ

  భారత సంతతికి చెందిన ఇంజినీర్ ,  పారిశ్రామికవేత్త , శ్రీనా కూరని అమెరికా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.కాలిఫోర్నియా జిల్లా నుంచి ఆమె హౌజ్ ఆఫ్ రిఫ్రజెంటివ్ కు పోటీ చేయనున్నారు. 

6.ప్రయాణికులతో విమానాలు కిటకిట

Advertisement

  అమెరికాలో విమానాశ్రయాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.దేశీయ ప్రయాణాలు, విహార యాత్రలు పెరగడమే దీనికి కారణం. 

7.భారత్ లోకి టెస్లా

ప్రస్తుతం భారత మార్కెట్ లో పర్యావరణ అనుకూల వాహనాల కు ఆదరణ  పెరుగుతున్న దృష్ట్యా అక్కడి మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు ఇదే అనువైన సమయంగా ప్రముఖ బ్యాటరీ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలన్ మాస్క్ భావిస్తున్నారు. 

8.వ్యాపారానికి భారత్ అనుకూలంగా కాదు : యూఎస్ స్టేట్ నివేదిక

  భారత్ లో వ్యాపార వ్యవహారాలు చేపట్టేందుకు అనుకూలమైన ప్రదేశం కాదని , అమెరికా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది.ఈ మేరకు యూఎస్ స్టేట్ నివేదిక అందించింది. 

9.మిషన్ వందేమాతరం

 వందే భారత్ మిషన్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు విదేశాల్లో చిక్కుకున్న దాదాపు 60 లక్షల మందికి పైగా భారతీయులను స్వదేశానికి చేర్చినట్లు కేంద్రం ప్రకటించింది. 

10.బ్రిటీషర్ల ఆకలి కేకలు

  ఒక వైపు కరోనా మరో వైపు లాక్ డౌన్ తదితర కారణాలతో బ్రిటన్ లో ఆహార సంక్షోభం తలెత్తింది.సూపర్ మార్కెట్లలో సరుకులు ఖాళీ అయిపోతుండడం తో బ్రిటన్ వసూలు నిత్యావసరాల కోసం నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.   .

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు