అందుకే ఆ సినిమా రిజెక్ట్ చేశా...

సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి ఆ తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకుని తన నటనా ప్రతిభను నిరూపించుకుని స్టార్ హీరోగా ఎదిగిన "యంగ్ హీరో సత్యదేవ్" గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే సత్యదేవ్ కేవలం హీరో పాత్రలలో మాత్రమే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.

దీంతో ప్రస్తుతం సత్యదేవ్ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు.అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను సత్యదేవ్ ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో ఓ దర్శకుడు కథ చెప్పేందుకు తన దగ్గరికి వచ్చాడని, కానీ కథ విన్న తర్వాత తనకు ఎంతగానో భయం వేసిందని అందువల్లనే ఆ దర్శకుడి చిత్రంలో తాను నటించలేదని చెప్పుకొచ్చాడు.అయితే ఆ దర్శకుడు చెప్పిన కథ పరంగా చూస్తే ఆ చిత్రంలో తన పాత్ర చాలా క్రూరంగా ఉంటుందని, అలాగే చిత్రంలో చిన్న పిల్లలని దారుణంగా హత్య చేసే సన్నివేశాలు ఉన్నాయని దాంతో తనకు కథ వింటుంటేనే భయం వేసిందని అందువల్లనే ఈ చిత్రంలో నటించలేనని నిర్మొహమాటంగా నో చెప్పాడట.

ఒకవేళ తాను ఇలాంటి పాత్రల్లో నటిస్తే కచ్చితంగా తనకు సినిమా పరిశ్రమలో కొంతమేర నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.కానీ తనకి ఇలాంటి కథ చెప్పిన ఆ దర్శకుడి పేరు మాత్రం సత్యదేవ్ చెప్పలేదు.

Advertisement

అయితే తనకు కేవలం హీరో పాత్రలు మాత్రమే చేయాలని ఎలాంటి ఆంక్షలు లేవని అలాగే తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే ఎలాంటి చిత్రంలోనైనా నటించడానికి సిద్ధమేనని తన మనసులో మాటని బయట పెట్టాడు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సత్యదేవ్ తెలుగులో దాదాపుగా మూడు చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు.

ఇందులో నూతన దర్శకుడు "నాగశేఖర్" దర్శకత్వం వహిస్తున్న "గుర్తుందా శీతాకాలం" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సత్యదేవ్ సరసన ముంబై మిల్కీ బ్యూటీ "తమన్నా" హీరోయిన్ గా నటిస్తోంది.

 కాగా ఈ చిత్రం కన్నడలో మంచి విజయం సాధించిన "లవ్ మొక్ టైల్" చిత్రానికి రీమేక్ గా ఉంది.అలాగే "తిమ్మరుసు" అనే మరో చిత్రంలో కూడా సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు.

 ఈ చిత్రానికి నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా "యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్" హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రంలో సత్యదేవ్ న్యాయం కోసం పోరాటం చేసేటటువంటి లాయర్ పాత్రలో కనిపించనున్నాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఇటీవలే ఈ చిత్రానికి సంబాయించిన ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Advertisement

తాజా వార్తలు