అమెరికా రాజకీయాల్లోకి తెలుగు అమ్మాయి..??

అమెరికాలో భారతీయులు రాజకీయాల్లో సైతం రాణిస్తున్నారు.ముఖ్యంగా తెలుగు వారు అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు కూడా.

అంతేకాదు తెలుగువారు ఎంతో మంది అమెరికా శ్వేత సౌధం లో కీలక స్థానాలలో వెలుగు వెలుగుతున్నారు.అయితే ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియా డెమోక్రటిక్ పార్టీ డిస్ట్రిక్ట్ 28 డెలిగేట్ అభ్యర్ధిగా తెలుగు అమ్మాయి అనూష కొండపర్తి పోటీ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది.

అక్కడ తన కమ్యూనిటీ మద్దతుతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా ఆమె తెలిపింది.బే - ఏరియాలోని ప్రజాప్రతినిధులతో ఉన్న పరిచయాలు తనని రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయని అన్నారు.కాంగ్రెస్‌మెన్‌ రోఖన్నా, సెనెటర్‌ జిమ్‌ బీల్ట్‌.

కౌన్సిల్‌ మెన్‌ రిషికపూర్‌ వంటివారితో కలిసి పనిచేసిన అనుభవం తనకు ఎంతగానో తోడ్పడుతోందని భావిస్తున్నానని తెలిపింది అనూష.

Advertisement

జనవరి 13వ తేదీన క్యాంప్‌బెల్‌ కమ్యూనిటీ సెంటర్‌లో జరిగే ఓటింగ్ లో అందరూ తప్పకుండా పాల్గొని తనకి మద్దతుగా ఓటు వేసి గెలిపిచండి అంటూ ఆమె విజ్ఞప్తి చేస్తోంది.అయితే బే ఏరియాలో తెలుగు కమ్యూనిటీకి బాగా పరిచయం ఉన్న దిలీప్‌ కొండిపర్తి కుమార్తె అనూష కొండిపర్తి.తెలుగు వారందరూ ఆమె విజయం సాధించేలా కృషి చేయాలని తెలుగు సంఘాలు కోరుతున్నాయి.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు