అమెరికాలో సంపన్నులపై పన్ను..?

యువత రాజకీయాల్లోకి వస్తే సమూల మార్పులు చేయడం పెద్ద విషయమేమీ కాదు.ఎన్నో ఆలోచనా శక్తులు వారి చురుకైన మెదడుకు ఉంటాయి.

చురుకైన, దేశం పై అభిమానం ఉన్న యువత రాజకీయాల్లోకి వస్తే ఆ దేశ చరిత్ర మారిపోతుంది అనడంలో సందేహం లేదు.

అయితే ఇప్పుడు ఇలాంటి ఆలోచనే చేసింది ఓ యువ ప్రజా ప్రతినిధి.అమెరికన్‌ కాంగ్రెస్‌కి ఎంపిక అయిన ఓ యువ ప్రజా ప్రతినిధి.అమెరికాలో సంపన్నులపై పన్ను పెంచాలని ప్రతిపాదన ముందుకు తీసుకువచ్చింది.

నయా సంపన్నులపై దాదాపు 60 నుండి 70 శాతం మేర పన్ను విధించాలని తెలిపింది.పర్యావరణ పరిరక్షణకుద్దేశించిన న్యూ గ్రీన్‌ డీల్‌ అమలుకు నిధులు సమకూర్చాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రతిపాదన తీసుకువచ్చింది.

Advertisement

ఆ ప్రజా ప్రతినిధి పేరు అకాషియో కార్టెజ్‌ .ఈ 29 ఏళ్ల యువ ప్రజా ప్రతినిధి తానూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని నెరవేర్చడానికి పాటుపడుతోంది.ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.2030 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను నిలిపివేసే లక్ష్యంతో కుదిరిన “గ్రీన్‌ న్యూ డీల్‌” అమలు జరగాలంటే తప్పకుండా పన్నులు విధించాలని తెలిపింది.

.

Advertisement

తాజా వార్తలు