ప్లీస్... అలా చేయాలంటూ చేతులెత్తి మొక్కుతున్న దర్శకుడు..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ విభిన్న కథనాలను పెంచుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ప్రముఖ దర్శకుడు రవి బాబు ముందుంటాడు.

అంతేకాక రవిబాబు కేవలం దర్శకుడి గా మాత్రమే కాకుండా నటుడిగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను నిరూపించుకునే సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతుండడంతో తాజాగా రవిబాబు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయం గురించి స్పందించాడు.ఇందులో భాగంగా చేతులెత్తి దణ్ణం పెడుతూ దయచేసి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరాడు.

అంతేకాక ప్రస్తుతం కరోనా వైరస్ నుంచి మనల్ని కాపాడే ఆయుధం కేవలం మాస్కు మాత్రమేనని కూడా సూచించాడు.అలాగే కరోనా వ్యాక్సిన్ మరియు క్వారెంటైన్ వంటివి కరోనా వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలని కానీ అంతకుముందే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తే ఎలాంటి అపాయం ఉండదని, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మాస్కులు ధరించకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వీడియో ద్వారా తెలిపాడు.

అలాగే మాస్కులు ధరించడం వల్ల కేవలం మనకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఎలాంటి అపాయము కలుగకుండా చూసుకోవచ్చని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.దీంతో వీడియో ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి రవి బాబుని నెటిజన్లు అభినందిస్తున్నారు.అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితులలో మాస్కు వాడమని సినీ సెలబ్రిటీలు చెప్పడం వల్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య రవిబాబు తెలుగులో ఆవిరి అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.

కాగా ప్రస్తుతం క్రష్ అనే అడల్ట్ కంటెంట్ చిత్రానికి రవి బాబు దర్శకత్వం వహిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి అయినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా విడుదలను కొంతకాలం పాటు వాయిదా వేశారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు