తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి7, మంగళవారం 2025

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.49

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.57

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు: ఉ.6.22 ల8.33

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12

రా.10.46 ల11.36

మేషం:

ఈరోజు గృహమున కొద్దిపాటి ఒత్తిడులు తప్పవు.దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.ఆరోగ్యం మందగిస్తుంది.

అక్కినేని అఖిల్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా.. ఆరోజే పెళ్లి బాజాలు మోగనున్నాయా?
చరణ్ కియరా జోడికి కలసి రాలేదా...అప్పుడు అలా... ఇప్పుడు ఇలా?

నూతన రుణాలు చేస్తారు.ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

Advertisement

వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.మీరంటే గిట్టను వారికి దూరంగా ఉండండి.

వృషభం:

ఈరోజు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి.వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి.

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.దైవదర్శనాలు చేసుకుంటారు.

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.

మిథునం:

ఈరోజు ఇంటా బయట ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాన్ని చూస్తారు.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరులతో గొడవలకు దిగకపోవడం మంచిది.

దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.మీ సంతాన విషయం లో జాగ్రతలు తీసుకోవాలి.

ఇతరులతో సంబంధాలు పెట్టుకోకుండా ఉండటం మంచిది.

సింహం:

ఈరోజు వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగమున అధికారులతో చర్చల్లో కొంత పురోగతి సాధిస్తారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

కన్య:

ఈరోజు సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.నూతన వాహన భూ లాభాలు కలుగుతాయి.పాత బాకీలు వసూలు చేస్తారు.

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పురోగతి కలుగుతుంది.

ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

తుల:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు.బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.

చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది.దూర ప్రయాణాలలో వాహనం నడిపే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది.

వృశ్చికం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు పొందుతారు.సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి.చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.

వాహన అనుకూలత కలుగుతుంది.వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

ఆర్థిక పురోగతి సాధిస్తారు.

ధనుస్సు:

ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.ఆలయ దర్శనాలు చేసుకుంటారు.ఇంటాబయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

వ్యాపారాలలో భాగస్తుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.

మకరం:

ఈరోజు దైవదర్శనాలు చేసుకుంటారు.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.

మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి.ఉద్యోగమున నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

కుంభం:

ఈరోజు విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు.భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

మీనం:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు ఉంటాయి.

అవసరానికి ధనసహాయం లభిస్తుంది.నూతన వాహన సౌఖ్యం ఉన్నది వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

తాజా వార్తలు