తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్15, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.05

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.20

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: మ.2.11 ల3.20

Advertisement
Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu September 15 Sunday 2024,

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu September 15 Sunday 2024,

ఈరోజు అనారోగ్య సమస్యల విషయంలో అశ్రద్ధ పనిచేయదు.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.కొన్ని పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తి కావు.

బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి.వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది.

Advertisement

వృషభం:

ఈరోజు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు.గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలు అనుకూలిస్తాయి.

ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

మిథునం:

ఈరోజు విద్యార్థులకు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు.

ప్రతికూల పరిస్థితుల నుండి తెలివిగా బయట పడతారు.వ్యాపారాలు పుంజుకుంటాయి.

ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు కొన్ని వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు.బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి.అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.

చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి.కుటుంబంలో ఊహించని వివాదాలు కలుగుతాయి.

వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

సింహం:

ఈరోజు ముఖ్యమైన పనులలో శ్రమకు ఫలితం ఉండదు.ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.సన్నిహితులతో కలహా సూచనలు ఉన్నవి.

కొత్త రుణయత్నాలు వేగవంతం చేస్తారు.ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

కన్య:

ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు.గృహమునకు కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.వ్యాపార పరంగా అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు.

ఉద్యోగ అనుకూలత కలుగుతుంది.

తుల:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆలయ దర్శనాలు చేసుకుంటారు.ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి కలుగుతుంది.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

వృశ్చికం:

ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్న.నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు పెరుగుతాయి.

ధనుస్సు:

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల మవుతాయి.ఉద్యోగులు అధికారుల సహాయ సహకారాలు పొందుతారు.వ్యాపారస్తులకు అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.మిత్రుల నుంచి ఆకస్మిక ధన లబ్ది పొందుతారు.

మకరం:

ఈరోజు అనుకోని ప్రయాణాలు వస్తాయి.రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి.దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది.కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం:

ఈరోజు ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.దూరపు బంధువుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు.ప్రముఖుల సలహాలు కొన్ని వ్యవహారాలలో పనిచేస్తాయి.

మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

మీనం:

ఈరోజు దూరప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు కష్టానికి తగిన ఫలితం ఉండదు.

వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు.

తాజా వార్తలు