తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై26, శుక్రవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.54

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.52

రాహుకాలం: ఉ.10.30 ల12.00

అమృత ఘడియలు: ఉ.11.00 ల10.20

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.24ల ల9.12 మ12.28 ల1.12

మేషం:

: ఈరోజు గృహమున విలువైన పత్రములు విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి.వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు.ఉద్యోగమున విధులు సరిగా నిర్వర్తించలేక పై వారి నుండి మాట పడవలసి వస్తుంది.

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి.

వైరల్ వీడియో : నెలకి 500.. ముంబైలో రూమ్ ఎలా ఉందో చూశారా..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై25, గురువారం 2024

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు.

వృషభం:

Advertisement

ఈరోజు సమయానికి తగిన ధన సహాయం అందుతుంది.వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.ఆరోగ్యం కుదుటపడుతుంది.

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు అధికారుల నుండి మన్నలను అందుకుంటారు.

మిథునం:

ఈరోజు ఆర్ధిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి.బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.సంఘంలో పెరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.

వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు.వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణ సూచనలు కలవు.

కర్కాటకం:

ఈరోజు కుటుంబ పెద్దలతో మాటపట్టింపులుంటాయి.ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి.

అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు.ఇంటా బయట ఒత్తిడి అధికమై ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.

కర్కాటకం:

ఈరోజు ఆలయ సందర్శన చేసుకొంటారు.సంతాన విషయంలో ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు.ఋణదాతల ఒత్తిడి అధికమై మానసిక బాధలు ఎదుర్కొంటారు.

దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.స్థిరాస్తి వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తి అవుతాయి.

వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

కన్య:

ఈరోజు ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు.చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి.వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి.

వృత్తి,వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

తుల:

ఈరోజు సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.వ్యాపారం ఉత్సాహంగా సాగుతుంది.దగ్గరి వారి నుండి సమయానికి ఆర్ధిక సహాయం అందుతుంది.

దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.

సమాజంలో పెరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.

వృశ్చికం:

ఈరోజు ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి.ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు.ఊహించని విధంగా ఖర్చులు అధికమవుతాయి.

ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి.వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.

వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

ధనుస్సు:

ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు.నిరుద్యోగులకు ఉత్సాహంగా సాగుతుంది.

విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.సంతానం విషయాలు సంతృప్తినిస్తాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

మకరం:

ఈరోజు అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు.సమయానికి నిద్రహారాలు ఉండవు.నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది.ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి.

ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి.

కుంభం:

ఈరోజు అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి.కీలకమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు.వస్త్రాభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకొంటారు.

మీనం:

ఈరోజు నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి.

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.అవసరానికి ఆర్ధిక సహాయం అందక ఇబ్బంది పడతారు.

తాజా వార్తలు