సుగంధ ద్రవ్యాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు అత్యంత ఖరీదైన వాటిలో కుంకుమపువ్వు( Saffron ) ఒకటి.కుంకుమపువ్వును ప్రెగ్నెంట్ అయిన మహిళలకు ప్రిఫర్ చేస్తూ ఉంటారు.
గర్భిణీలు కుంకుమపువ్వు పాలు తాగడం వల్ల పిల్లలు ఎర్రగా ఆరోగ్యంగా పుడతారని నమ్మకం.ఆరోగ్యపరంగా కుంకుమపువ్వు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.
అలాగే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి కూడా కుంకుమపువ్వు సహాయపడుతుంది.ఇంతకీ చర్మానికి కుంకుమపువ్వు ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె( honey ) మరియు నాలుగు కుంకుమపువ్వు రేకలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని కనీసం పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
ఆపై వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా తరుచూ చేయడం వల్ల చర్మంపై మొండి మచ్చలు మాయమవుతాయి.
స్కిన్ స్మూత్ గా, గ్లోయింగ్ గా మారుతుంది.

అలాగే స్క్రీన్ వైట్నింగ్ కోసం ఆరాటపడేవారు ఒక బౌల్ లో పావు కప్పు కాచి చల్లార్చిన పాలు( milk ), నాలుగు కుంకుమపువ్వు రేకలు వేసి అరగంట పాటు నానబెట్టాలి.ఆ తర్వాత కుంకుమపువ్వు పాలల్లో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి ( Sandalwood powder )వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తర్వాత వాటర్ తో కడిగేయాలి.
రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా కనుక చేశారంటే చర్మం తెల్లగా మారుతుంది.ప్రకాశవంతంగా మెరుస్తుంది.

ఇక కుంకుమ పువ్వును మనం టోనర్ గా కూడా ఉపయోగించవచ్చు.ఒక కప్పు రోజ్ వాటర్ లో చిటికెడు కుంకుమపువ్వు వేసి బాగా షేక్ చేసి అరగంట పాటు వదిలేయాలి.తద్వారా మన టోనర్ రెడీ అవుతుంది.ఈ టోనర్ ను రోజు ఉపయోగించడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.మృదువైన మెరిసే చర్మాన్ని మీ సొంతం చేస్తుంది.మేకప్ ఎక్కువ సమయం తాజాగా ఉండటానికి కూడా ఈ టోనర్ సహాయపడుతుంది.







