తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 10, బుధవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.49

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.55

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.9.00 ల9.30

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.34

మేషం:

ఈరోజు సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు పొందుతారు.ఆర్ధిక లాభం కలుగుతుంది.గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు.

సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి.అన్ని విషయాలలో బంధు మిత్రుల సహాయం అందుతుంది.

దేవర మూవీ ఐదో రోజు కలెక్షన్లు లెక్కలు ఇదే.. ఎన్టీఆర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారుగా!
లైఫ్ లో ఎవరినీ నమ్మొద్దు.. వైరల్ అవుతున్న బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు!

నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది.

Advertisement

వృషభం:

ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికమౌతుంది.ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.వ్యాపారాలలో నూతన సమస్యలు జాగ్రత్త అవసరం.

వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మిథునం:

ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి.ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.కొన్ని వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు.

ఆర్ధిక కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది.వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

ఉద్యోగస్తులు అప్పగించిన విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కర్కాటకం:

ఈరోజు పాత ఋణ ఒత్తిడి నుండి బయట పడటానికి నూతన ఋణాలు చెయ్యాల్సి వస్తుంది.చిన్న నాటి మిత్రులతో మాటపట్టింపులుంటాయి.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

ఇంటా బయట చికాకులు అధికమౌతాయి.వృత్తి వ్యాపారాలలో ఫలితాలు నిరాశ కలిగిస్తాయి.

సింహం:

ఈరోజు ఉద్యోగమున అధికారులతో సమస్యలు పరిష్కరించుకుంటారు.వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో చెయ్యడం మంచిది.ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.

బంధువులలో స్వల్ప వివాదాలు ఉంటాయి.

కన్య:

ఈరోజు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.సోదర వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందుతారు.

తుల:

ఈరోజు వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు.ధన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

ఆప్తులతో మాట పట్టింపులుంటాయి.వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.

విద్యార్థులు మరింత కష్టపడాలి.

వృశ్చికం:

ఈరోజు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.అన్ని వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి.

ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

ధనుస్సు:

ఈరోజు వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆదాయం విషయంలో లోటుపాట్లు అధిగమిస్తారు.

వ్యాపారములలో శత్రు సమస్యలు నుండి బయటపడతారు.ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.

మకరం:

ఈరోజు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు.ప్రభుత్వ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి.

సంతాన విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి.ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.

ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు.

కుంభం:

ఈరోజు సంతాన విద్యా విషయాలు సమస్యాత్మకంగా ఉంటాయి.వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమౌతాయి.ఖర్చులను అదుపు చెయ్యడం కష్టంగా ఉంటుంది.

దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని శుభ వార్తలు వింటారు.మీ వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంది.

మీ మీద ఉన్న బాధ్యత తీరిపోతుంది.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి.ఈరోజు మీ స్నేహితుల వల్ల సంతోషంగా గడుపుతారు.

తాజా వార్తలు