తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు14, బుధవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.00

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.44

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.7.33 ల9.50

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.34

మేషం:

ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.వృత్తి, వ్యాపారాలు ఆశజనకంగా సాగుతాయి.ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది

వృషభం:

జుట్టుకు కలర్ వేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు .. కీలక ఆధారాలు లభ్యం ? 

ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.కొన్ని వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.వృధా ఖర్చులు పెరుగుతాయి.

Advertisement

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి.

వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

మిథునం:

ఈరోజు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి.ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.

మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఉద్యోగులు అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు.

కర్కాటకం:

ఈరోజు చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు.ఇంటాబయట ఒత్తిడులు అధికామౌతాయి.ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది.

రుణయత్నాలు ఫలించవు.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

సింహం:

ఈరోజు నూతన రుణయత్నాలు చేస్తారు.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.దూరపు బంధువులను కలుసుకుంటారు.

ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది.వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కన్య:

ఈరోజు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

సోదరుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

తుల:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి.

నూతన వస్తులాభాలు పొందుతారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వృశ్చికం:

ఈరోజు బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు.ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.

చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు.వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

ధనుస్సు:

ఈరోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.

కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.వ్యాపారపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి.

మకరం:

ఈరోజు ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

కుంభం:

ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది.

బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు.

మీనం:

ఈరోజు దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.నూతన వాహన యోగం ఉన్నది.

వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

తాజా వార్తలు