తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు3, శనివారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: దయం 5.57

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.49

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.6.30 ల7.34

Advertisement

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఇంటాబయటా సమస్యలు అధికమవుతాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

వృత్తి వ్యాపారాలలో మరింత కష్టపడాలి.పాత రుణాలు ఒత్తిడి వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

అప్పుడు కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ కు వెళ్లనన్న విష్ణుప్రియ.. ఇప్పుడు మాత్రం ట్విస్ట్ ఇచ్చారుగా!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్ట్2, శుక్రవారం 2024

ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

Advertisement

వృషభం:

ఈరోజు పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.

వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో సఖ్యత కలుగుతుంది.వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు.

మిథునం:

ఈరోజు గృహంలో వివాహది శుభకార్యాలు నిర్వహిస్తారు.వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి.

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి.

కర్కాటకం:

ఈరోజు దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయడం మంచిది కాదు.ఇంటా బయట గందరగోళ వాతావరణం ఉంటుంది.

ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి.స్థిరస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు ఉండవు.

ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

సింహం:

ఈరోజు కుటుంబ సభ్యుల ధన సహాయ సహకారాలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో అధికారుల పదోన్నతులు పెరుగుతాయి.నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

వ్యాపారపరంగా భాగస్థులతో చర్చలు అనుకూలస్తాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.

కన్య:

ఈరోజు చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి.నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలసిరావు.వృధా ఖర్చు విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

వృత్తి ఉద్యోగములలో అధికారులతో చికాకులు తప్పవు.

తుల:

ఈరోజు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది.నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి.

నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి.చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

వృశ్చికం:

ఈరోజు నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలుంటాయి.కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనలు వలన మతాపట్టింపులు కలుగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది.

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.నూతన రుణాలు చేయకపోవడం మంచిది.

ధనుస్సు:

ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ పడతారు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.చేపట్టిన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది.

మకరం:

ఈరోజు నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు.నూతన గృహ వాహన యోగం ఉన్నది.

బంధు మిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు.ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది.

ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.

కుంభం:

ఈరోజు గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి కొంత వరకు బయట పడతారు.

కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.వ్యాపారమున అనుకూల వాతావరణం ఉంటుంది.

మీనం:

ఈరోజు కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు.

వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.

తాజా వార్తలు