తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 14, బుధవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

.సూర్యోదయం: ఉదయం 5.45.సూర్యాస్తమయం: సాయంత్రం 06.

47.రాహుకాలం:మ.12.00 ల1.30.అమృత ఘడియలు:ఉ.9.00 ల11.00 మ12.00 సా4.00.దుర్ముహూర్తం:ఉ.11.57 ల12.48.

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

.

మేషం:

ఈరోజు సమస్యలన్ని పరిష్కరించుకుంటారు.మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.అందరితో మంచి స్నేహబంధం గా ఉంటారు.ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.కొన్ని వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.సమయాన్ని కాపాడుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు. .

వృషభం:

ఈరోజు మీరు ఆసక్తికరమైన వ్యక్తులను కలుస్తారు.ఆరోగ్యం పట్ల అసలు పట్టించుకోరు.విశ్రాంతి తీసుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తారు.ఉద్యోగం అందుకునే అవకాశం ఉంటుంది.ఆర్థికంగా ఎక్కువగా సంపాదిస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది. .

మిథునం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వలేక పోతారు.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వాదనలు జరిగే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువులపై దృష్టి పెట్టాలి.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి. .

కర్కాటకం:

Advertisement

ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.ఆర్థికంగా ఎక్కువగా సంపాదిస్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ జీవితభాగస్వామితో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇతరులు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. .

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు పెరుగుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. .

కన్య:

ఈరోజు మీరు మంచి జీవితాన్ని గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని విషయాల వల్ల మానసిక ఒత్తిడి కలుగుతుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. .

తులా:

ఈరోజు మీరు ఆస్తుల గురించి బాగా చర్చలు చేస్తారు.దీనివల్ల కొన్ని కలహాలు కూడా ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన విషయాల గురించి సలహాలు తీసుకుంటారు. పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. .

వృశ్చికం:

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్18, శుక్రవారం 2024

ఈరోజు మీరు ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా పొదుపు చేయాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.కొన్ని వాదనల నుండి తప్పించుకునే ప్రయత్నం చేయాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. .

ధనస్సు:

Advertisement

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.చాలా సంతోషంగా ఉంటారు. .

మకరం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.సొంత నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి.కొన్ని పుణ్యక్షేత్రాల ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. .

కుంభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. .

మీనం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా వారితో వాదనలకు దిగకండి.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు..

తాజా వార్తలు