తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 10 , ఆదివారం, 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.51

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

51

రాహుకాలం: మ.1.03 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.04.40 నుంచి 06.10 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.05.02 నుంచి 05.53 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.తోటి వారి సహాయం మీకు అందుతుంది.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
ఈ రాశుల వారితో పోటీ పడడం చాలా కష్టం..!

వృషభం:

Advertisement

ఈరోజు మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు.స్థలం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

మిథునం:

ఈరోజు మీ ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.అనవసరమైన విషయాల్లో తల దూర్చకపోవడమే మంచిది.

మీ ఇంటికి అనుకోకుండా ఈరోజు బంధువులు వస్తారు.వారితో చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

ఈరోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.

కొన్ని చెడు సవాసాలకు దూరంగా ఉండాలి.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచి జరుగుతుంది.

సింహం:

ఈరోజు మీరు తోబుట్టువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

కన్య:

ఈరోజు మీరు అప్పు తీరుస్తారు.కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.

స్నేహితుల నుండి అడ్డంకులు ఎదుర్కొంటారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

తులా:

ఈరోజు మీరు కొత్త పని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది.శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది.

వృశ్చికం:

ఈరోజు వ్యవసాయ దారులు అధిక లాభాలు అందుకుంటారు.పిల్లలని విదేశాల్లో చదివించాలని ఆలోచనలో ఉంటారు.ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.

వర్గ సంబంధిత విభేదాలు వస్తాయి.మానసిక బలహీనత ఎక్కువగా మీలో ఉంటుంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో అడ్డంకులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో కడుపుతారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.కానీ ఏదో తెలియని బాధ మీలో ఉంటుంది.

మకరం:

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీపై ఉన్న బాధ్యతలని నిర్లక్ష్యం చేస్తారు.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.

మీ మిత్రుల వలన కొన్ని సమస్యల నుండి బయట పడతారు.ప్రయాణం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుంభం:

ఈరోజు మీరు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.మానసిక ఆందోళనలతో సతమతమవుతారు.మీరు చేసే పనుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది.

విద్యార్థులు చదువులో మరింత దృష్టి పెట్టాలి.సమయాన్ని వృధా చేయకండి.

మీనం:

ఈరోజు మీరు మనోధైర్యంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.స్నేహితులతో చాలా సంతోషంగా ఉంటారు.

తాజా వార్తలు