తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 30 శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.48

సూర్యాస్తమయం:సాయంత్రం 06.10

రాహుకాలం:ఉ.

09.40 నుంచి 11.05 వరకు

అమృత ఘడియలు: ఉ.12.09 నుంచి 01.41వరకు

Advertisement

దుర్ముహూర్తం:మ.01.53 నుంచి 03.18వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలను పొందుతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.మీ పాత స్నేహితులను కలవడం వల్ల కాలక్షేపం చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది.

మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి.

ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట వత్తిడి ఎక్కువవుతోంది.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి.

మీ పాత స్నేహితుల నుండి సహాయం అందుతుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.తీరికగలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

కన్య:

మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఆర్థిక పరంగా నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తీరికలేని సమయంతో గడుపుతారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనిలో ఇబ్బందులు ఎదురవుతాయి.

తులా:

ఈరోజు మీరు ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులకు ఇచ్చిన అప్పు తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

వృశ్చికం:

ఆర్థిక పరంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.తీరిక లేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే వాయిదా పడే అవకాశం.తొందరపాటు వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీ పాత స్నేహితులతో కలసి కాలక్షేపం చేస్తారు.ఉద్యోగస్తులకు ఇబ్బందులెదురవుతాయి.

మకరం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు అనుకూలం గా ఉంటాయి.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వినడం వల్ల సంతోషం గా ఉంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

మీనం:

ఈరోజు మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు ఈరోజు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు