తెలుగులో పలు చిత్రాలు మరియు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి ఇటు బుల్లితెర ప్రేక్షకులను, అటు వెండితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న తెలుగు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “రాగిణి” గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాగా తాజాగా నటి రాగిణి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇందులో భాగంగా ఈ మధ్యకాలంలో కొందరు నటీనటులు తనకు ఫోన్ చేసి సినిమా పరిశ్రమలో మహిళలపై జరుగుతున్నటువంటి అకృత్యాలను గురించి తెలియజేస్తూ ఉంటారని తెలిపింది. కానీ తాను మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు మరియు లైంగిక వేధింపులు ఎదుర్కోలేదని తెలిపింది.
అంతేగాక తాను అందరి పట్ల చాలా గౌరవంగా ఉంటానని అందువల్ల తనని ఎవరూ ఇప్పటివరకూ ఎలాంటి కమిట్మెంట్ గానీ లేదా లైంగిక పరమైన కమిట్మెంట్ ఇవ్వమని అడగలేదని తెలిపింది.
అంతేకాక సినిమా పరిశ్రమలో మనం ప్రవర్తించే తీరను బట్టి కొంతమంది మనం ఎలాంటి వాళ్ళమని నిర్ణయిస్తారని తెలిపింది. ఇందులో ముఖ్యంగా తోటి నటీనటులతోగాని లేదా ఇతరులతో భుజం భుజం రాసుకొని తిరుగుతుంటే కచ్చితంగా “సాయంత్రం ఖాళీగా ఉన్నావా.?” వస్తావా.?” అంటూ అడుగుతారని అలా కాకుండా ప్రతి ఒక్కరి పట్ల మర్యాదగా ప్రవర్తిస్తే ఇలాంటి సమస్యలు ఉండవని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఇప్పటివరకు తాను దాదాపుగా 550 కి పైగా ధారావాహికలతో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించానని చెప్పుకొచ్చింది.
అంతేగాక అప్పటికే తన బంధువు అయినటువంటి రజిత మరియు తన అక్క కృష్ణవేణి తదితరులు తెలుగు సినిమా పరిశ్రమలో బాగానే రాణిస్తున్నారని అందువల్లనే తాను బుల్లి తెరకి ఎక్కువగా పరిమితమయ్యానని తెలిపింది.