బిగ్‌బాస్ 5 : కంటెస్టెంట్స్ విషయంలో ఆ వార్తలు నిజం కాదట

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఈ ఏడాది ఉండదేమో అనే అనుమానాలకు తెర పడ్డట్లయ్యింది.

బిగ్‌ బాస్ సీజన్ 5 ఖచ్చితంగా ఈ ఏడాదిలోనే ఉంటుందని కాకుంటే కాస్త ఆలస్యంగా ఈ సీజన్ ఉంటుందని క్లారిటీ వచ్చేసింది.

స్టార్‌ మా వారు ఈ సీజన్ ను మొదలు పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.సెట్‌ ను పునః నిర్మించే పనిలో ఉండటంతో పాటు మరో వైపు కంటెస్టెంట్స్ జాబితాను సిద్దం చేస్తున్నారు.

కొన్ని నెలల క్రితమే 100 మంది జాబితాను సిద్దం చేశారు.వారిలో నుండి ఇప్పటికే 50 మందిని తొలగించి ఆ లిస్ట్‌ ను మరింత షార్ట్‌ గా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక కంటెస్టెంట్స్ జాబిత విషయంలో ఇటీవల ఒక వార్త సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేయడం మొదలు అయ్యింది.తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 కోసం కంటెస్టెంట్స్ దొరకడం లేదు.

Advertisement

ఈ సమయంలో పారితోషికం చాలా తక్కువగా ఇవ్వడంతో పాటు కరోనా జాగ్రత్తల విషయంలో కూడా కొన్ని అనుమానాలు ఉన్న కారణంగా ఎవరు కూడా హౌస్‌ లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు అనేది ఒక వార్త.ఆ వార్తపై తాజాగా స్టార్‌ మా టీమ్‌ క్లారిటీ ఇచ్చింది.

ఇప్పటికే బిగ్‌ బాస్ కు వెళ్లేందుకు 50 మందితో కూడిన జాబితా రెడీ అయ్యింది.బిగ్‌ బాస్‌ అంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఎగిరి గంతేస్తారు.

అలాంటిది ఎందుకు షో కు హాజరు కాకుండా ఉండాలనుకుంటారు.ప్రస్తుతం ఎంపిక అయిన 50 మందిలో ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడా అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు.

ఈసారి కపుల్స్ కూడా వెళ్లబోతున్నారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

అతి త్వరలోనే షార్ట్‌ లిస్ట్‌ చేస్తామని సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ వరకు షో ను పట్టాలెక్కించేందుకు సిద్దం చేస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు.షో కు సంబంధించిన ఇతర ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ కూడా జరుగుతుందని ఇప్పటి నుండే అన్ని స్కిట్‌ లకు సంబంధించిన విషయాలు చర్చలు జరుగుతున్నాయని స్టార్‌ మా వర్గాల వారు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు