తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచిన అభిజిత్ అనూహ్యంగా ఇప్పటి వరకు కొత్త సినిమాలు ఏమీ కమిట్ కాక పోవడం అందరికి ఆశ్చర్యం ను కలిగిస్తుంది.ఇప్పటికే రన్నర్ గా నిలిచిన అఖిల్ ఒక వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించేందుకు కమిట్ అయ్యాడట.
మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయి.ఇక నెం.3 గా నిలిచిన సోహెల్ కూడా అద్బుతంగా తన కెరీర్ ను మలుచుకుంటూ ముందుకు సాగుతున్నాడు.సోహెల్ ఇప్పటికే మూడు సినిమాలు కమిట్ అయ్యాడు.
అందులో ఒక సినిమా అధికారికంగా ప్రకటన వచ్చింది.జార్జి రెడ్డి నిర్మాతలు ఆ సినిమాను నిర్మించబోతున్న విషయం తెల్సిందే.
వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ కు ఆ సినిమాను తీసుకు వెళ్లేందుకు సోహెల్ సిద్దంగా ఉన్నాడు.ఇక బాలీవుడ్ వెబ్ సిరీస్ లో కూడా సోహెల్ నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
కాని ఇప్పటి వరకు అభిజిత్ నుండి ఎలాంటి అప్ డేట్ మాత్రం రాలేదు.
హౌస్ లో ఉన్న సమయంలో తాను హీరోగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను.
ఖచ్చితంగా ప్రేక్షకులు చూపిస్తున్న ఈ అభిమానంకు తాను రిటర్న్ బ్యాక్ గా సినిమాలు చేసి వారిని ఎంటర్ టైన్ చేస్తాను అన్నాడు.కాని ఇప్పటి వరకు అభిజిత్ నుండి సినిమా ప్రకటన రాలేదు.
పలువురు దర్శకులు ఆయన్ను కలిశారట.కాని ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఆయన ఓకే చెప్పలేదు.
అభిజిత్ గేమ్ లో చాలా నిలకడగా ఆడుతూ హడావుడి లేకుండా విన్నర్ అయ్యాడు.ఇప్పుడు కూడా సినిమా ఆఫర్ల విషయంలో కూడా ఎక్కువ ఆలోచించి మాస్టర్ మైండ్ తో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాడు.
అందుకే కాస్త ఆలస్యం అవుతుందని సన్నిహితులు అంటున్నారు.అయితే ఈ ఆలస్యం మరీ ఎక్కువ అయితే బాగోదు అనేది కొందరి అభిప్రాయం.
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో హీరోగా పరిచయం అయిన అభిజిత్ ఆ ఇమేజ్ ను వాడుకోలేదు.మరి ఇప్పుడు కూడా ఆయన బిబి ఇమేజ్ వాడుకోకుంటే మాత్రం ఆయన కెరీర్ లో ముందు ముందు కష్టమే అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.