తెలుగులో తళుక్కున మెరిసిన ఈ హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు కార్తీక్ వర్మ దర్శకత్వం వహించిన టువంటి "భం బోలేనాథ్" అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన "పూజ ఝవేరి" తెలుగు ప్రేక్షకులకు కొంత మేర సుపరిచితమే.

అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోక పోవడంతో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

కానీ తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు మాత్రం బాగానే దక్కించుకుంది.అయితే తన తదుపరి చిత్ర కథల ఎంపిక విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో ఈమె నటించినటువంటి ఎక్కువ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి.

దీంతో కొత్త సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమయింది.  తెలుగులో పూజ ఝవేరి రైట్  రైట్, ద్వారక, టచ్ చేసి చూడు, 47డేస్, తదితర చిత్రాలలో నటించింది.

 మరోవైపు కన్నడలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ అక్కడ కూడా పెద్దగా రాణించలేక పోయింది.అయితే ప్రస్తుతం తమిళంలో పూజ ఝవేరి "8" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.

Advertisement

 అలాగే తెలుగులో "బంగారు బుల్లోడు" అనే చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.ఏదేమైనప్పటికీ పూజ ఝవేరి తెలుగులో కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే  కొత్త సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమైందని కొందరు సినీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు