ఈ హీరోయిన్ ఒకప్పుడు అవకాశాలు లేక స్పెషల్ సాంగ్స్ లో నటించింది... చివరికి...

ఒకసారి కొంతమంది నటీనటులు హీరో హీరోయిన్లుగా సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినప్పటికీ తడౌపరి చిత్ర కథల విషయంలో తీసుకున్న నిరణ్యాలు లేదా ఇతర కారణాల వల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి లేదా స్పెషల్ సాంగ్స్ లో నటించడానికి పరిమితం అవుతుంటారు.

ఇలాంటి నటీనటులు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.

కాగా మరి కొంతమందయితే  ఈ స్పెషల్ సాంగ్స్ ద్వారానే మంచి ఫేమ్ తో పాటూ మరిన్ని అవకాశాలు దక్కించుకుంటూ నాలుగురాళ్లు వెనకేసుకుంటున్నారు.కాగా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి చిత్రంలోని హోలీ హొలీ స్పెషల్ సాంగ్ లో నటించి కుర్రకారు గుండెల్లో హిట్ పెంచేసిన నటి ముంతాజ్ కూడా ఈ కోవకే చెందుతుంది.

అయితే ముంబై లో పుట్టి పెరిగిన ముంతాజ్ సినిమాలపై ఆసక్తి కలగడంతో పిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఈక్రమంలో 1999వ సంవత్సరంలో "మోనిష ఎన్ మోనాలీసా" అనే తమిళ చిత్రం ద్వారా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టింది.

దీంతో ఈ అమ్మడు అందచందాలకి ఫిదా అయిన దర్శకనిర్మాతలు ఎక్కువగా బోల్డ్ మరియు వ్యాంప్ తరహా పాత్రలలో నటించే అవకాశాలను ఇచ్చారు.దీంతో ముంతాజ్ మొహమాటానికి పోయి నటించిన ఈ పాత్రలే ఈ అమ్మడి సినిమా జీవితాన్ని నిర్ణయించాయి.

Advertisement

దీంతో ముంతాజ్ కి ఎక్కువగా సెకండ్ హీరోయిన్ మరియు స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశాలే ఎక్కువగా తలుపు తట్టాయి. దీంతో ముంతాజ్ కూడా చేసేదేమీ లేక తన సినిమా కెరీర్ కోసం అలాంటి పాత్రలలోనే నటించింది.

అయితే ముంతాజ్ నటిగా మాత్రమేగాకుండా పలు చిత్రాలకి సహ నిర్మాతగా కూడా వ్యవహరించింది.ఇక్కడ కూడా ఈ అమ్మడికి నిరాశే ఎదురైంది.

దీంతో ప్రస్తుతం ముంతాజ్ సినిమా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతోంది.ఆ మధ్య తెలుగులో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన "ఆగడు" చిత్రంలో విలన్ లవర్ పాత్రలో నటించింది.

 కానీ ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు లభించ లేదు.దీంతో ప్రస్తుతం ముంతాజ్ తమిళంలో "వలైయన్" అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. నటన పరంగా మంచి ప్రతిభ ఉన్నటువంటి ముంతాజ్ పలు చిత్రాల కథల విషయంలో మరియు పాత్రల విషయంలో తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల కారణంగానే ఆమె సినీ జీవితం ముగిసిపోయిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు