చలన చిత్ర పరిశ్రమలో పలు వ్యక్తిగత జీవిత సమస్యల వల్ల లేదా ఇతర కారణాల వల్లగాని రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న నటీనటులు చాలా మంది ఉన్నారు.ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగార్జున, తదితర స్టార్ హీరోలు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.
కాగా ఇలా రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారిలో తెలుగు ప్రముఖ స్వర్గీయ నటి మరియు దర్శకురాలు విజయ నిర్మల తనయుడు సీనియర్ హీరో నరేష్ ఒకరు.కాగా నటుడు నరేష్ అప్పట్లో “జంబలకడి పంబ” అనే చిత్రం ద్వారా సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.
ఆ తర్వాత నటన పరంగా మంచి టాలెంట్ ఉన్నప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల స్టార్ హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు.కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ జీవితానికి మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
< ఇందులో భాగంగా తాను మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాననే విషయంపై స్పందిస్తూ తనకి మొదట 19 సంవత్సరాలు వయసు రాగానే పెళ్లి చేశారని, పెళ్లయిన కొంత కాలం తరువాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని తెలిపాడు.ఆ తర్వాత రెండో పెళ్లి కూడా అలాగే జరిగిందని దాంతో తన రెండో భార్య కూడా విడాకులు ఇచ్చానని తెలిపాడు.
ఇక మూడవ భార్య విషయానికొస్తే ఆమె పేరు రమ్య రఘుపతి.ఈమె ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె.
కాగా రమ్య రఘుపతి విదేశాల్లో దర్శకత్వ విభాగంలో పలు కోర్సులను కూడా చేసింది.ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడటంతో పెద్దలు పెళ్లి చేశారు.
కాగా నరేష్ ఒకానొక సమయంలో ఆర్థిక పరమైన సమస్యలు మరియు సోషల్ సమస్యలు, రాజకీయ పరమైన సమస్యలు వంటి వాటి కారణంగానే తన వ్యక్తిగత జీవితం కొంతమేర డిస్ట్రబ్ అయ్యిందని తెలిపాడు.అయినప్పటికీ సమాజసేవ మాత్రం అస్సలు మానని నరేష్ చెప్పుకొచ్చాడు.
ఇక తనతో విడిపోయిన తన ఇద్దరి భార్యలతో తనకు ఇప్పటికీ మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని దాంతో అప్పుడప్పుడు తరచూ వెళ్లి వారి యొక్క యోగక్షేమాలను కూడా తెలుసుకుంటానని, మంచి స్నేహితులుగా ఉంటారని చెప్పుకొచ్చాడు.

ఇక చిన్నప్పుడు తాను మహేష్ బాబు, రమేష్ బాబు తదితరులు మంచి వాతావరణంలో పెరిగామని అందువల్లనే చాలా కంఫర్టబుల్ గా ఉండేదని అలాగే తనకి మహేష్ బాబు కుటుంభ సభ్యుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని తెలిపాడు.సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ తనకు గాడ్ ఫాదర్ లాంటివాడిని అలాగే ఇందిరా దేవి కూడా తరచూ తన ఇంటికి వచ్చి వెళుతూ ఉంటుందని కూడా తమ అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు.ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాక్టర్ నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బాగానే రాణిస్తున్నాడు.
కాగా ప్రస్తుతం తెలుగులో నరేష్ విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న “దృశ్యం 2” చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.
కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను కూడా సురక్షితంగా ఉంచండి.– తెలుగుస్టాప్.కామ్ యాజమాన్యం
.