తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి18, గురువారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.50

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.03

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.9.20 ల9.35

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ2.48 ల3.36

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది.ఇతరులకు వీలైనంత సహాయం చేస్తారు.ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి.

అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి.

Advertisement

వృషభం:

ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి.వృత్తి ఉద్యోగాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

వ్యక్తిగత విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది.ఆదాయానికి మించి ఖర్చు చేయాలి.

మిథునం:

ఈరోజు ఉద్యోగ జీవితం కూడా ప్రశాంతంగా సాగిపోతుంది.వృత్తి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి.కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు ముఖ్య మైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

అదనపు ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి.

కర్కాటకం:

ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది.వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగిపోతాయి.ఉద్యోగ సంబంధమైన ఎటు వంటి ప్రయత్నమైనా సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది.

ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి.

సింహం:

ఈరోజు కుటుంబ వ్యవహారాలు, దాంపత్య జీవి తానికి సంబంధించి మధ్య మధ్య కొన్ని ఇబ్బందులు, ఒత్తిళ్లు తప్పకపోవచ్చు.స్వల్ప అనారోగ్యా లకు కూడా అవకాశం ఉంది.అయితే, శుక్రుడు, కుజుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో మీ వ్యూహాలు, ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి.

కన్య:

ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది.వృత్తి ఉద్యోగ సంబంధమైన వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి.

వృత్తుల్లో డిమాండ్ పెరుగుతుంది.ఉద్యోగంలో ప్రాభవం ఏర్పడుతుంది.

వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి.

తుల:

ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు లభించే అవకాశం ఉంది.ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.

కొన్ని ముఖ్యమైన ఆర్థిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రాభవం బాగా పెరుగుతుంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి పెద్దల నిర్ణయాలు తీసుకోవాలి.

లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ధనుస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తల్లిదండ్రులతో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించాలి.

కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు త్వరగా పూర్తి అవుతాయి.

కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దీని పట్ల మనశ్శాంతి కోల్పోతారు.

మీ స్నేహితుల నుండి సహాయం పొందుతారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

మీ చిన్ననాటి స్నేహితులతో చర్చలు చేస్తారు.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఎక్కువ వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడం లో ఆలస్యం చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా లేదు.పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తాజా వార్తలు