టీఆర్ఎస్ కు కాశ్మీర్ ఫీవర్ పట్టుకుందా ? అందుకేనా ఈ వణుకు

ఆర్టికల్ 370 ని రద్దు చేసి వివాదస్పదమైన కాశ్మీర్ విషయంలో బీజేపీ ముందడుగు వేసింది.దీంతో బీజేపీకి దేశవ్యాప్తంగా ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది.

పార్టీలకు అతీతంగా అందరూ బీజేపీ చర్యలను సమర్ధించారు.అయితే బీజేపీ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో డైలమాలో పడిపోయింది.

రోజు రోజుకి తెలంగాణాలో బలపడుతున్న బీజేపీని ఎలా నిలువరిద్దామనే ఆలోచనలో ఉండగానే బీజేపీకి ఈ రేంజ్ లో ఇమేజ్ పెరగడం జీర్ణించుకోలేకపోతోంది.అదీకాకుండా తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్న తరుణంలో ఆ ఎన్నికలపై ఆందోళన ప్రారంభమయింది.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము క్లిన్ స్వీప్ చేసేందుకు సిద్ధం అంటూ ప్రగల్భాలు పలికిన టీఆర్ఎస్ ఇప్పుడు మాత్రం ఎన్నికలు మరికొంతకాలం వాయిదా పడితే బెటర్ అన్న ఆలోచనకు వస్తోంది.

Advertisement

ఆ భయానికి కారణం కూడా ఉంది.తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే బీజేపీకి కశ్మీర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందేమోననని టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారట.ఇప్పటికే పార్టీ సభ్యత్వం విషయంలో యువత, విద్యావంతులంతా బీజేపీ వైపు వెళుతున్నారని, ఇప్పుడు కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు చేయడంతో ఎక్కడ చూసినా బిజెపి ఘనత పైనే చర్చ జరుగుతోందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.

ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని టీఆర్ఎస్ అనుమానిస్తోంది.పార్లమెంట్ ఎన్నికల్లో మోఢీ హవా టీఆర్ఎస్ పార్టీ ఆశలకు గండి కొట్టింది.తెలంగాణలోని యువత, ఉద్యోగులందరూ బిజెపి వైపు మొగ్గు చూపారు.

కేసీఆర్ కుమార్తె కవితనే ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.అయితే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీపై రివెంజ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది.

టిఆర్ఎస్.దీనిలో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అవుతోంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

కానీ కేంద్ర పరిణామాలతో దేశం మొత్తం మోదీ నాయకత్వాన్ని పొగుడుతుంటే టీఆర్ఎస్ తట్టుకోలేకపోతోంది.ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే మరోసారి ఫలితాలను తారుమారు చేస్తుందని టీఆర్ఎస్ భయపడుతోంది.

Advertisement

ఒక్కసారి అమిత్ షా ,లేదా ప్రధాని మోదీ తెలంగాణలో అడుగుపెడితే ఆ పార్టీ బలం పెరుగుతోందనే భావనలో టిఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడ్డారు.బీజేపీపై ఇప్పుడున్న సెంటి మెంట్ కు తోడు తమపై వ్యతిరేకత కూడా ప్రభావం చూపిస్తుందనే చర్చ టిఆర్ఎస్ లో జరుగుతోంది.

ఇదే సమయంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తమ ప్రతాపం చూపించాలని బీజేపీ నాయకులు ఉత్సాహంగా ఉన్నారు.టీఆర్ఎస్ ను దెబ్బ కొట్టడానికి ఇదే సరైన సమయమని వారు భావిస్తున్నారు.

దీంతో పాటు ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీజేపీలోకి చేరికలు ఉంటాయని భావిస్తున్నారు.తెలంగాణాలో అమిత్ షా ,లేదా ప్రధాని మోదీ తెలంగాణలో అడుగుపెడితే ఆ పార్టీ బలం మరింత పెరుగుతోందనే భావనలో టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

అందుకే మరి కొంతకాలం మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో పడిందట టీఆర్ఎస్.

తాజా వార్తలు