సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కీలక పాత్రను విజయశాంతి పోషిస్తున్న విషయం తెల్సిందే.ఈ చిత్రంతో విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.
చాలా ఏళ్ల క్రితం కెమెరాకు దూరం అయిన విజయశాంతి నేడు అంటే ఆగస్టు 9 నుండి షూటింగ్‌లో జాయిన్ కాబోతుంది.నేడు మరో ప్రత్యేకత కూడా ఉన్న విషయం తెల్సిందే.
మహేష్‌బాబు బర్త్‌డే అయిన నేడు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి విజయశాంతి కెమెరా ముందుకు రాబోతుంది.నేడు ఒకటి రెండు షాట్స్ తీసి బర్త్‌డే వేడుకలు నిర్వహించబోతున్నారు.

రేపటి నుండి రెగ్యులర్‌గా సీరియస్‌గా చిత్రీకరణలో విజయశాంతి పాల్గొనబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.మేజర్ పాత్రలో మహేష్‌బాబు నటిస్తున్న విషయం తెల్సిందే.ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్నను ఎంపిక చేశారు.ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో మహేష్‌బాబుతో కలిసి రష్మిక కూడా షూటింగ్‌లో పాల్గొంటుంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఈ ఏడాది సంక్రాంతికి దర్శకుడు అనీల్ రావిపూడి ‘ఎఫ్ 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకున్నాడు.ఇప్పుడు మహేష్‌తో తెరకెక్కిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంతో వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకుంటాను అనే నమ్మకంతో అనీల్ రావిపూడి ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇక అనీల్ రావిపూడి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రంను తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.







