వినాయక్‌ కెమెరా ముందుకు వచ్చేది ఎప్పుడంటే

టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న దర్శకుడు వివి వినాయక్‌.ఈయన ప్రస్తుతం దర్శకుడిగా పెద్దగా సక్సెస్‌లు దక్కించుకోలేక పోతున్నాడు.

 Vv Vinayak Wants To Face The Camera In Soon-TeluguStop.com

దాంతో ఈయన నటుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు భారీ ఎత్తున సక్సెస్‌లను దక్కించుకున్నాయి.

కాని ప్రస్తుత పరిస్థితి అలా లేదు.అందుకే వినాయక్‌ నటుడిగా ఎంట్రీ ఇవ్వడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

వినాయక్‌ కెమెరా ముందుకు వచ్చ

అంతా ఆశ్చర్యపోయేలా వినాయక్‌ ఏకంగా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.వినాయక్‌ పర్సనాల్టీకి హీరో ఏంటీ అంటూ అంతా అవాక్కవుతున్నారు.అందరిని మరింత ఆశ్చర్యపర్చేలా హీరోగా కనిపించేందుకు చాలా లావును తగ్గనున్నట్లుగా తెలుస్తోంది.లావు తగ్గేందుకు ఇప్పటికే వర్కౌట్లు మొదలు పెట్టిన ఈయన త్వరలోనే కెమెరా ముందుకు రాబోతున్నాడు.

ఈ చిత్రంను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి నిర్మించబోతున్న విషయం తెల్సిందే.

వినాయక్‌ కెమెరా ముందుకు వచ్చ

నర్సింహారావు దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రంలో వినాయక్‌ చాలా విభిన్నంగా కనిపించబోతున్నాడు.ఒక దర్శకుడు హీరోగా మారడం కామన్‌గా చూస్తూనే ఉన్నాం.కాని వినాయక్‌ ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లకు హీరోగా మారడం చర్చనీయాంశం అవుతుంది.

ఈ చిత్రం తర్వాత వినాయక్‌ నటుడిగా కొనసాగుతాడా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube